చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన పాక్ బ్యాటర్
IND vs PAK: టీ20 వరల్డ్ కప్‌లో భారత్.. తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. లో..యెస్ట్ స్కోర్‌ను కాపాడుకోగలిగింది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియాకు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించింది భారత్. ఈ రెండింట్లో కూడా బౌలర్లే.. హీరోలు. ఈ నెల 12వ తేదీన తన తదుపరి మ్యాచ్‌లో యునైటెడ్ స్టేట్స్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన.
గ్రూప్ ఏలో భాగంగా న్యూయార్క్‌లోని నస్సౌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయారు. 19 ఓవర్లల్లో 119 పరుగులకే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే.

అనంతరం ఛేజింగ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు ఏ ఒక్కరూ క్రీజ్‌లో కుదురుకోలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తోండటంతో చెలరేగిపోయారు. నిప్పుకణికల్లాంటి బంతులను సంధించారు.
ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే టాప్ స్కోరర్. 44 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 31 పరుగులు చేశాడు రిజ్వాన్. బాబర్ ఆజమ్- 13, ఉస్మాన్ ఖాన్- 13, ఫకర్ జమాన్- 13, ఇమద్ వసీం- 15, షాదబ్ ఖాన్- 4, ఇఫ్తికర్ అహ్మద్- 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నసీం షా- 10, షహీన్ షా అఫ్రిది- 0 పరుగులతో చివరి వరకు క్రీజ్‌లో నిలవగలిగారు.
ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచారు బౌలర్లు. ప్రత్యేకించి జస్‌ప్రీత్ బుమ్రా. తన నాలుగు ఓవర్ల కోటాలో 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఇఫ్తికర్ అహ్మద్.. వికెట్లు అతని ఖాతాలో పడ్డాయి. హార్దిక్ పాండ్యా- 2, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Best video on the internet today.❤️#INDvsPAK pic.twitter.com/dAYsyWQqVG
— शिवाय (@mohbhangpiya) June 9, 2024
మ్యాచ్ ఓడిపోయిన తరువాత నసీం షా.. చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. పరాజయ భారంతో కన్నీళ్లు పెట్టుకుంటూ క్రీజ్‌ను వదిలాడు. మరో బ్యాటర్ షహీన్ షా అఫ్రిది.. అతణ్ని ఓదార్చడం కనిపించింది. వారిద్దరూ నాటౌట్‌గా నిలిచారు గానీ.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. అత్యల్ప స్కోరును కూడా అందుకోలేకపోవడంతో నసీం షా బాధ వర్ణనాతీతమైంది.












Click it and Unblock the Notifications