IND Vs SL, WC 2023: సిరాజ్,అయ్యర్ డ్రాప్ - ఆ ఇద్దరికీ ఛాన్స్, పరుగుల వరద..!!

ప్రపంచ కప్ లో మ్యాచ్ లు కీలక దశకు చేరుకున్నాయి. టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఏడవ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరుజట్లు తలపడనున్నాయి. ప్రతీ మ్యాచ్ లో గెలుపు..రన్ రేట్ అన్ని జట్లకు కీలకంగా మారుతున్న సమయంలో శ్రీలంకతో మ్యాచ్ వేళ టీమిండియా తుది జట్టు ఎంపిక విషయంలో పలు మార్పులకు సిద్దమైంది.

జోరు కొనసాగించేనా: ప్రపంచ కప్ లో రోహిత్ సేన అజేయ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లను ఓడించిన భారత జట్టు ఇప్పుడు ముంబై చేరుకుంది. ఇప్పుడు శ్రీలంకపై కూడా అజేయంగా కొనసాగాలని భారత్ కోరుకుంటోంది.

IND Vs SL: Shreys Iyer and Siraj, they might replace them with Ishan Kishan and Shardul Thakur

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిన శ్రీలంక మళ్లీ గెలుపుబాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే ఫీల్డ్‌లో 12 ఏళ్ల క్రితం 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టును ఓడించి 28 ఏళ్ల తర్వాత ఎంఎస్ ధోనిసారథ్యంలో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరం కానున్నాడు.

పరుగుల వరద ఖాయం: వాంఖడే స్టేడియం ఎప్పుడూ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ కప్ లోనూ బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ సౌతాఫ్రికా వరుసగా 399,382 పరుగులు చేసింది. దీంతో, ఈ రోజు జరిగే మ్యాచ్ లోనూ పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. తొలుత ఎవరు బ్యాటింగ్ చేసినా 300 పరుగులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇదే విధంగా ఈ పిచ్ స్పిన్నర్ల కు సహకరిస్తుంది.

దీంతో, టీమిండియా తుది జట్టు ఎంపికలో పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించనున్నారు. ఈ టోర్నీలో అయ్యర్‌ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే రాలేదు.శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్ కు తుది జట్టులో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఇక, బౌలర్ల విషయంలోనూ మార్పులు ఉంటాయని సమాచారం.

IND Vs SL: Shreys Iyer and Siraj, they might replace them with Ishan Kishan and Shardul Thakur

తుది జట్టులో కీలక మార్పులు: షమీ ఎంట్రీ తరువాత అంచనాలకు మించి రాణిస్తున్నాడు. దీంతో, షమీ..బూమ్రా ను ఈ మ్యాచ్ లో కొనసాగించటం ఖాయంగా కనిపిస్తోంది. మహ్మద్‌ సిరాజ్‌ స్ధానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. కుల్దీప్ యాదవ్, రవిచందర్ అశ్విన్ రాణిస్తుండటంతో వీరిలో మార్పు ఉండే అవకాశం లేదు.

స్పిన్నర్లకు సహకరించే పిచ్ కావటంతో అశ్విన్ కు ఛాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. పరుగుల వదర ఖాయం కావటంతో ఈ గ్రౌండ్ నుంచి కోహ్లీ మరో 34 పరుగులు చేస్తే ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. అదే విధంగా మరో సెంచరీ చేస్తే శతకాల్లో సచిన్ తో సమానంగా నిలిచే క్షణం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో, ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+