IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. భారత్ పక్కా ప్లాన్!
IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 అంతర్జాతీయ సిరీస్‌లోని రెండో మ్యాచ్ రాంచీలోని JSCA అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టేడియంలో ఇప్పటికే తేమ ఎక్కువగా ఉండటం, సాయంత్రం అయ్యేసరికి మంచు ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతోనే చేజింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు. మొదటి మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను దిద్దుకుని, బలమైన భారత జట్టుపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించడమే తమ లక్ష్యమని షాయ్ హోప్ స్పష్టం చేశాడు. తమ జట్టులో ఓ మార్పు చేస్తూ ఫోర్డ్ స్థానంలో గుడకేష్ మోటీని తుది జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందన
టాస్ ఓడిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని భావించినప్పటికీ.. పరిస్థితులకు తగ్గట్లు అలవాటుపడటం ముఖ్యమని అన్నాడు. స్టేడియంలో మంచు ఉన్నందున రెండో ఇన్నింగ్స్ లో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్ లో ఆడే 40 ఓవర్ల పాటు జట్టు ప్రమాణాలను అత్యున్నతంగా నిలుపుకోవడంపై దృష్టి పెట్టామని, ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ విజయాల పరంపరను కొనసాగించడమే తమ లక్ష్యమని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. భారత జట్టు గత మ్యాచ్ ఆడిన అదే జట్టుతోనే బరిలోకి దిగుతోందని.. దీంతో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కలేదని వెల్లడించాడు.

వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్:
షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), కామిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పొవెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, గుడాకేష్ మోటీ, షమర్ స్ప్రింగర్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.














Click it and Unblock the Notifications
