విండీస్ తో మ్యాచ్ వేళ భారత్ కు కొత్త టెన్షన్ - సూర్య చేసిన మిస్టేక్ తో, డూ ఆర్ డై..!!
T20 World Cup: భారత్ సెమీస్ లో చేరుతుందా. చేరాలంటే ఒక్కటే దారి. వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. అయితే, భీకర ఫాంలో ఉన్న వెస్టిండీస్ పై టీమిండియా విజయం సులభమేనా. ఇదే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చగా మారింది. జింబాబ్వే మీద భారత్ గెలిచినా... బౌలర్ల పేలవ ప్రదర్శన ఈ సందేహాలకు కారణం అవుతోంది. సౌతాఫ్రికా బౌలర్ల విండీప్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చినా.. భారీ స్కోరు సాధించారు. జింబాబ్వే మ్యాచ్ లో సూర్య చేసిన ఆ మిస్టేక్ ఇప్పుడు విండీస్ తో మ్యాచ్ వేళ టెన్షన్ గా మారుతోంది.
సూపర్-8లో భారత్ తన చివరి మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. సెమీస్‌కు లేదంటే.. ఇంటికి వెళ్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా... జింబాబ్వేపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్, భారత జట్ల నెట్ రన్‌రేట్ +1.791, -0.100గా ఉన్నాయి. నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలర్లు ఆశించిన మేర రాణించలేదు. ఇంకా భారీ విజయం నమోదు కావాల్సింది.. సూర్య కుమార్ తప్పుడు నిర్ణయాలు, దూబె ధారళంగా పరుగులు ఇవ్వడంతో పరిస్థితులు మారిపోయా ని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దాదాపు100 పరుగుల తేడాతో గెలిచి ఉంటే... నెట్ రన్‌రేట్‌లో విండీస్ జట్టును భారత్ దాటేది. మ్యాచ్ ఏదైనా పరిస్థితుల్లో జరగకపోయినా... రన్ రేటు ఆధారంగా సెమీస్ చేరే అవకాశం ఉండేది. ఇదే సమయంలో భారత్ బౌలర్ల ప్రదర్శన పైనా ఆందోళన కనిపిస్తోంది.

పేలమైన బౌలింగ్ లో విండీస్ తో మ్యాచ్ వేళ టెన్షన్
జింబాబ్వేపై భారత్ గెలిచిప్పటికీ.. టీమిండియా బౌలింగ్‌పై అభిమానులు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితులో భారత్ గెలిస్తే మాత్రమే సెమీస్‌కు వెళ్తుంది. కానీ విండీస్ ముందు రెండు అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ గెలిచినా, మ్యాచ్ రద్దైనా కరేబియన్ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుతుంది. ఇదే ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మార్చి 1న విండీస్, భారత్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది. ఇటీవల భారత్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. దీంతో వర్షం కారణంగా విండీస్ తో జరిగే మ్యాచ్ రద్దు అవుతాదేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ లో ఓపెనర్ దగ్గర నుంచి చివరి వరకు అందరూ బంతిని బౌండరీకి పంపేందుకు వచ్చాం అనే విధంగా ప్రపంచ కప్ లో ఆడుతున్నారు. మరి.. వీరిని నియంత్రించేందుకు గంభీర్ - సూర్య కాంబో ఏం ప్లాన్ చేస్తారు.. బౌలర్లను ఎలా సమాయత్తం చేస్తారనేది విండీస్ తో మ్యాచ్ వేళ అసలైన పరీక్షగా మారుతోంది. బూమ్రా.. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయటంలో వారి వ్యూహాలు ఫలించటం లేదు. దీంతో.. టీం పైన ఒత్తిడి పెరుగుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications