జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ!

INDW vs ZIMW: వడోదరలోని కోటంబి స్టేడియంలో భారత మహిళల జట్టు, జింబాబ్వే మహిళల జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు జింబాబ్వేను 9 వికెట్ల తేడాతో ఓడించింది. జింబాబ్వే నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 27.1 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి ఛేదించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి ఫోర్ కొట్టి తన అద్భుతమైన సెంచరీని పూర్తి చేసుకుని జట్టును విజయపథంలో నడిపించిన ఓపెనర్ ప్రతీకా రావల్.. భారత జట్టు సాధించిన ఈ ఏకపక్ష, సునాయాస విజయానికి ప్రధాన కారకురాలిగా నిలిచింది.

IND vs NZ: చివరి ఓవర్లలో అసలైన ట్విస్ట్.. కివీస్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
IND vs NZ: చివరి ఓవర్లలో అసలైన ట్విస్ట్.. కివీస్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!

సెంచరీతో ప్రతీకా రావల్ విధ్వంసం.. షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ
198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ స్మృతి మంధాన, ప్రతీకా రావల్ పవర్‌ప్లేలోనే భారత జట్టుకు దూకుడుగా ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 94 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 34 బంతుల్లో 32 పరుగులు చేసిన కెప్టెన్ స్మృతి మంధాన.. ఒలివియా చారే బౌలింగ్‌లో ఔటయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన షెఫాలీ వర్మ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన షెఫాలీ వర్మ కేవలం 33 బంతుల్లోనే 193.93 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 64 పరుగులు చేసింది, ఇందులో 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.

IND W vs ZIM W 1st ODI Pratika Rawal Century Powers India to 9-Wicket Win Match Highlights Here

మరోవైపు ప్రతీకా రావల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి సెంచరీతో ఆకట్టుకుంది. భారత్ గెలవడానికి 2 పరుగులు అవసరమైన సందర్భంలో ప్రతీక తన సెంచరీని పూర్తి చేయడానికి 4 పరుగులు అవసరం కాగా 27వ ఓవర్ (27.1 ఓవర్లు) తొలి బంతికి, ఆమె ఓ అద్భుతమైన బౌండరీ కొట్టింది. ఈ బౌండరీతో ప్రతీక 96 బంతుల్లో తన తొలి సెంచరీని (100*, 15 ఫోర్లు) పూర్తి చేయడమే కాకుండా, ఇంకా 137 బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు 9 వికెట్ల చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

రైతులకు దీపావళి కానుక? అక్టోబర్ 30న అన్నదాతల అకౌంట్లలోకి నిధులు!
రైతులకు దీపావళి కానుక? అక్టోబర్ 30న అన్నదాతల అకౌంట్లలోకి నిధులు!

చెలరేగిన శ్రీ చరణి, క్రాంతి గౌడ్.. 197 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. భారత బౌలర్ల బౌలింగ్‌ను తట్టుకోలేక 49.5 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే తరఫున బిలావేద్ బిజా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మావియాంగా 29 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రీ చరణి అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 3 మెయిడెన్లతో సహా కేవలం 23 పరుగులే ఇచ్చి, 4 కీలక వికెట్లు పడగొట్టింది. ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ 42 పరుగులకు 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ 2 వికెట్లు, షెఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+