89 పరుగులకే కుప్పకూలిన టీమిండియా: 26 ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డ్

న్యూజిలాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. మౌంట్ మాంగనుయ్‌ బే ఓవల్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ పేసర్ల ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 244 పరుగుల భారీ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంత భారీ తేడాతో ఓడిపోవడం 26 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఇదే మొదటిసారి.

అయిదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యతలో ఉంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. సిరీస్ డిసైడర్ 15న ఇదే స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌ అయ్యాడు. అక్కడ ఆరంభమైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేకులు పడలేదు. ఇంటర్వెల్ అనేది లేకుండా క్రమం తప్పకుండా వికెట్లు కూల్చారు బౌలర్లు.

India 89 All Out as Matt Henry 6 wickets Heaviest Defeat 26 Years New Zealand Clinch Stunning Win

విరాట్ కోహ్లీ నాలుగు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించాడు. దీంతో ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రుతురాజ్ గైక్వాడ్ అయిదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేస్తోన్నాడహో: ట్రిగ్గర్ నొక్కిన రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేస్తోన్నాడహో: ట్రిగ్గర్ నొక్కిన రాహుల్ గాంధీ

ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్రమైన ఒత్తిడిలో పడింది. జట్టును ఆదుకోవడానికి వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కొంతసేపు పోరాడాడు. 53 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్- 21, నమన్ ధీర్- 21 పరుగులతో కొంత ప్రతిఘటించారే తప్ప ఓటమి కోరల నుంచి జట్టును తప్పించలేకపోయారు.

అదరగొట్టిన న్యూజిలాండ్: సెంచరీ బాదిన స్టార్ బ్యాటర్- టీమిండియాకు భారీ టార్గెట్
అదరగొట్టిన న్యూజిలాండ్: సెంచరీ బాదిన స్టార్ బ్యాటర్- టీమిండియాకు భారీ టార్గెట్

మిగిలిన బ్యాటర్లెవరూ కూడాన్యూజిలాండ్ బౌలర్ల దాడి ముందు నిలవలేకపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 26.4 ఓవర్లలోనే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. న్యూజిలాండ్ విజయంలో ఆ జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ కీలక పాత్ర పోషించాడు. లైన్ అండ్ లెంగ్త్ స్వింగ్ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 9.4 ఓవర్లల్లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు కూల్చాడు.

ఆ ఇస్లామిక్ మత ప్రబోధకుడిపై కేంద్రం కొరడా: అయిదేళ్ల బ్యాన్ పొడిగింపు
ఆ ఇస్లామిక్ మత ప్రబోధకుడిపై కేంద్రం కొరడా: అయిదేళ్ల బ్యాన్ పొడిగింపు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కుల్ దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్ వికెట్లను పడగొట్టి భారత ఇన్నింగ్స్ వెన్నుముక విరిచాడు. హెన్రీకి మరో పేసర్ మాథ్యూ ఫిషర్ చక్కటి సహకారాన్ని అందించాడు. 7 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కైల్ జేమీసన్ ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ బౌలర్లు కంబైన్డ్ ఎఫర్ట్‌తో విరుచుకుపడటంతో భారత ఇన్నింగ్స్ ఆరంభమైన కొద్దిసేపటికే క్లోజ్ అయింది.

అంతకుముందు న్యూజిలాండ్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. విల్ యంగ్ 108 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోర్ సాధించడానికి పునాది వేశాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 58 మెరుపు బ్యాటింగ్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+