టీమిండియా నుంచి స్టార్ స్పిన్నర్ అవుట్: బ్రార్ భయ్యాకు చోటు

న్యూజిలాండ్‌తో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వన్డేల్లో తడాఖా చూపిన ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌ టెస్ట్ జట్టుకు ఎంపిక అయ్యాడు. అదే సమయంలో చైనామన్ స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్‌ను జట్టు నుంచి విడుదల చేసినట్లు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. కుల్ దీప్.. ఇప్పుడు దేశవాళీ మ్యాచ్ లు ఆడనున్నాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో వన్డే జట్టులో కొనసాగుతున్నాడు.. గుర్నూర్ బ్రార్. టెస్ట్ టీమ్ తో కలవాల్సి ఉన్నందున 15వ తేదీ ఆదివారం మౌంట్ మాంగానుయ్‌లో జరిగే అయిదో వన్డేకు అందుబాటులో ఉండట్లేదు. ఈ చివరి వన్డే కోసం గుర్నూర్ స్థానంలో బీసీసీఐ ఏ ఇతర ఆటగాడిని జట్టులోకి తీసుకోలేదు. గుర్నూర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 13 వన్డే మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. అతని ట్రాక్ రికార్డ్ బాగుండటంతో టెస్టులు ఆడే అవకాశం కల్పించింది. దీంతో ఈ ఫార్మట్ లో అతను అరంగేట్రం చేయనున్నాడు.

India have released Kuldeep Yadav from their Test squad against New Zealand added Gurnoor Brar

మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా టెస్టులకు అందుబాటులోకి వచ్చాడు. వెల్లింగ్టన్‌లో టెస్ట్ ప్లేయర్లతో కలిసి ట్రైనింగ్ సెషన్స్ కు అటెండ్ అయ్యాడు. ఈ సిరీస్‌లో ధ్రువ్ జురెల్‌తో పాటు రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్లుగా జట్టుకు అందుబాటులో ఉండనున్నారు.

పసిడి ధరల పతనానికి ఎట్టకేలకు బ్రేక్.. !!
పసిడి ధరల పతనానికి ఎట్టకేలకు బ్రేక్.. !!

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 19 నుంచి వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య రెండో టెస్టు పోరు నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లే ఓవల్ వేదికగా ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు కలిసొస్తోండటంతో బీసీసీఐ ఈ మార్పులు చేసింది. అదనపు స్వింగ్, బౌన్స్ దృష్టిలో ఉంచుకుని గుర్నూర్ బ్రార్ ను టెస్ట్ ఫార్మట్ లోకి తీసుకుంది. అతని రాకతో పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మరింత బలపడినట్టయింది.

89 పరుగులకే కుప్పకూలిన టీమిండియా: 26 ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డ్
89 పరుగులకే కుప్పకూలిన టీమిండియా: 26 ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డ్

న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ ఉన్నారు.

న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించడం టీమిండియాకు కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకోవడానికి ఈ రెండింట్లోనూ గెలవాల్సిన అవసరం ఉంది. 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లతో కూడిన భారత జట్టు మెరుగైన ప్రదర్శనతో సిరీస్ దక్కించుకోవాలని ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+