T20 world cup: టీమిండియా చెత్త రికార్డు-ఐర్లాండ్ తర్వాత మనమే..!
టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026)లో భాగంగా ఇప్పటికే సూపర్ 8 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ దశలో అత్యధిక విజయాలతో భారత్ (india)తో పాటు మరో ఏడు జట్లు సూపర్ 8కు అర్హత సాధించాయి. టీమిండియా అయితే ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. సొంత గడ్డపై అలవోకగా విజయాలు సాధిస్తూ టైటిల్ రేసులో మరో అడుగు వేసిన సూర్య సేనకు ఇప్పుడు ఓ విషయంలో మాత్రం టెన్షన్ పెరుగుతోంది. ఇదే విషయాన్ని భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ బయటపెట్టాడు.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయాలు సాధించినా చెత్త ఫీల్డింగ్ తో పరువు పోగొట్టుకుంది. ఈ నాలుగు మ్యాచ్ లలో కలిపి భారత్ ఏకంగా 9 క్యాచ్ లు వదిలేసింది. ఈ టోర్నీలో 10 క్యాచ్ లు వదిలేసిన ఐర్లాండ్ తర్వాత భారత్ రెండో స్ధానంలో ఉంది. చివరికి ఆరు క్యాచ్ లు వదిలేసి నమీబియా కూడా ఫీల్డింగ్ లో భారత్ కంటే మెరుగ్గానే ఉంది. దీంతో టీమిండియా ఫీల్డింగ్, క్యాచ్ లు జారవిడవడంపై చర్చ జరుగుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ఫీల్డింగ్ తప్పిదాల్ని ప్రస్తుతానికి కవర్ చేస్తున్నా సూపర్ 8 దశలో ఇదే అతి పెద్ద సమస్యగా మారబోతోందన్న ఆందోళన మొదలైంది. ఇదే విషయాన్ని భారత మాజీ పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ కీలకంగా ప్రస్తావించాడు. ఇది భారీ సమస్య అని తెలిపాడు. గత 12 నెలల్లో లేదా బహుశా 18 నెలల్లో భారత్ ఇప్పటివరకు అత్యంత చెత్త క్యాచింగ్ జట్టు అని తేల్చేశాడు. మనోళ్ల క్యాచింగ్ శాతం 70 కంటే తక్కువన్నాడు. ప్రతి మ్యాచ్‌లో కనీసం 2-3 క్యాచ్‌లను వదిలేస్తున్నారని, సూపర్ 8, సెమీఫైనల్స్ స్ధాయిలో ఆడుతున్నప్పుడు ఇప్పటికైనా మన ప్లేయర్లు కీలకమైన క్యాచ్‌లను వదిలేయరని ఆశిస్తున్నట్లు ఆరోన్ తెలిపాడు.












Click it and Unblock the Notifications