సన్‌రైజర్స్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్

IND vs BAN 1st T20: బంగ్లాదేశ్‌తో తొలి టీ20 ఇంటర్నేషనల్‌లో తలపడబోతోంది భారత జట్టు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని శ్రీమంత్ మాధవ్ రావు సింధియా క్రికెట్ స్టేడియంలో ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలు కాబోతోంది. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఇది.

మొన్నటి వరకు టెస్ట్ సిరీస్‌లో తీరిక లేకుండా గడిపింది భారత క్రికెట్ జట్టు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు టీ20ల్లో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతోంది.

India playing 11 vs Bangladesh 1st T20I Mayank Yadav and Nitish Kumar Reddy to get debuts

దాదాపుగా ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు, టీ20 స్పెషలిస్టులతో నిండిన యంగ్ టీమ్ ఇది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. జట్టుకు సారథ్యాన్ని వహిస్తోన్నాడు. కేప్టెన్‌ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ ఫార్మట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో దాదాపుగా అందరూ ఐపీఎల్ స్టార్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు బీసీసీఐ సెలెక్టర్లు.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్ మినహా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేని ప్లేయర్లే జట్టులో ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌తో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేయనున్నారు. తుదిజట్టులో అతన్ని తీసుకోవడం దాదాపుగా ఖాయమైనట్టే.

అలాగే కోల్‌కత నైట్ రైడర్స్ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ కూడా తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు లేకపోలేదు. సన్‌రైజర్స్‌కే చెందిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ సెన్సేషన్ రింకూ సింగ్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లకు ఇంటర్నేషనల్స్‌లో తమ సత్తాను నిరూపించుకోవడానికి మరోసారి అవకాశం లభించింది.

తుదిజట్టులో- అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ తుదిజట్టులో- లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), పర్వేజ్ హొస్సైన్ ఇమాన్, తన్జిద్ హసన్, నాజ్ముల్ హొస్సేన్ శాంటో (కేప్టెన్), మెహదీ హసన్ మిర్జా, తౌహీద్ హృదొయ్, మహ్మదుల్లా, రిషద్ హొస్సైన్, తన్జిమ్ హసన్ షకిబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+