న్యూజిలాండ్ తో రెండో టీ20: టీమిండియా వర్రీ అదే

న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్ భారత క్రికెట్ జట్టు సిద్ధపడుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. క్రైస్ట్ చర్చ్ లోని హాగ్లే స్టేడియం దీనికి వేదిక. తొలి మ్యాచ్‌లో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది భారత్. అయినప్పటికీ.. బౌలింగ్ కలవరపెడుతోంది. తొలి టీ20లో బ్యాటర్ల అద్భుత పోరాట పటిమ వల్ల విజయం దక్కినప్పటికీ, సిరీస్ నిలబెట్టుకోవాలంటే బౌలింగ్ విభాగం గాడిన పడాల్సిన అవసరం ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ఇదే ఉద్దేశంతో రెండో టీ20 మ్యాచ్ తుదిజట్టును ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన నాలుగు ఓవర్లలో 49 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆయన వేసిన రెండు నోబాల్స్, రెండు వైడ్లు.. అతనికి మ్యాచ్‌ పై పట్టు చిక్కట్లేదనే విషయాన్ని నిరూపించాయి.

India Playing 11 vs New Zealand 2nd t20 Vaibhav Sooryavanshi set to Return as Ishan Kishan Sits Out

న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ ఆరంభంలోనే భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్‌లపై విరుచుకుపడ్డారు. స్పిన్నర్లు కూడా చేతులెత్తేశారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా నిరాశపరిచాడు. నితీష్ కుమార్ రెడ్డి 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నమన్ ధీర్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్ లో రాణించాడు. హార్డ్ లెంగ్త్‌లను డెలివరీ చేయడంలో టీమిండియా బౌలర్లు ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఏపీ తీరానికి ఆర్ణబ్ తుఫాన్- రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు: మత్స్యకారులకు సూచనలు
ఏపీ తీరానికి ఆర్ణబ్ తుఫాన్- రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు: మత్స్యకారులకు సూచనలు

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీంతో తుది జట్టులో మార్పులు అనివార్యం అయ్యాయి. ఇషాన్ కిషన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కొచ్చు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలూ లేకపోలేదు. మొదటి మ్యాచ్ లో రాణించిన సంజూ శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు. నాలుగు, అయిదు స్థానాల్లో కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ బ్యాటింగ్ కు రావొచ్చు.

తిరుమలలో ఇక చింత లేకుండా
తిరుమలలో ఇక చింత లేకుండా

న్యూజిలాండ్ జట్టు కూడా బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే ఆరంభంలో స్వింగ్ సాధించినప్పటికీ.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేయలేకపోయారు. పవర్ ప్లేలోనే వీరిద్దరూ 94 పరుగులు సాధించడంతో మ్యాచ్ భారత్ వశమైంది. స్పిన్నర్లు మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పెట్టినప్పటికీ అది పెద్దగా ఫలితాలనివ్వలేదు.

పవర్ ప్లేలో పరుగులు కట్టడి చేయడమే శనివారం నాటి మ్యాచ్‌లో తమకు ప్రధాన సవాల్ అని శాంట్నర్ పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ జట్టు ఓ స్పెషలిస్ట్ బౌలర్ తో బరిలో దిగొచ్చు. రెండో టీ20 కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పైనే జరగనుండటంతో బౌలర్లు చెమటోడ్చక తప్పదు. టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ, మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే బౌలర్లు సరైన లెంగ్త్‌తో వికెట్లు తీయడం అవసరం.

భారత్ తుదిజట్టులో.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+