పూజలు, యజ్ఞయాగాదులు షురూ
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. తుదిదశకు చేరుకుంది. ఇంకొన్ని గంటల్లో ఫైనల్స్. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిట్ హాట్ ఫేవరెట్ భారత జట్టును ఎదుర్కొనబోతోంది న్యూజిలాండ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది భారత్. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఆ తరువాత పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. చివరి లీగ్‌లో బ్లాక్ క్యాప్స్‌ను ఓడించింది. ఈ మూడు మ్యాచ్‌లను ఆడింది దుబాయ్ పిచ్ మీదే. ఇప్పుడు ఫైనల్స్ కూడా అక్కడే ఆడబోతోండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పిచ్ స్థితిగతులు ఎలా ఉంటాయనే విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడినట్టయింది.

ఫైనల్స్ ఆడే తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవచ్చు టీమిండియా. గత ఆదివారం న్యూజిలాండ్‌ను ఓడించిన జట్టుతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నలుగురు స్పిన్నర్లు- అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని తుదిజట్టులో తీసుకోవచ్చు.
పేస్ బౌలింగ్‌ను మహ్మద్ షమీ లీడ్ చేయనున్నాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటాకింగ్‌కు దిగడం ఖాయం. నలుగురు స్పిన్నర్లు వద్దనుకుంటే మేనేజ్‌మెంట్ బెస్ట్ ఆల్టర్నేట్.. అర్ష్‌దీప్ సింగ్. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించి.. కుల్‌దీప్ యాదవ్‌ను తప్పించవచ్చు.

ఇప్పటివరకు వన్డేల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య 119 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్‌దే పైచేయి. 61 మ్యాచ్‌లల్లో భారత్ గెలిచింది. 50 గేమ్‌లు కివీస్ సొంతం అయ్యాయి. ఒక్క మ్యాచ్ టై అయింది. ఏడు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గాయి. ఐసీసీ ఈవెంట్‌లల్లో కూడా సమానంగా నిలిచాయి ఈ రెండు జట్లు. చెరో ఆరు మ్యాచ్‌లను గెలిచాయి.
#WATCH | #ICCChampionsTrophy2025 | Kanpur, UP: Indian cricket team supporters perform 'havan' at the Radha Madhav Temple to pray for the team's victory in today's final clash against New Zealand. pic.twitter.com/MbYeeiyORo
— ANI (@ANI) March 9, 2025
కాగా ఫైనల్స్‌లో భారత్ విజయం సాధించాలంటూ అభిమానులు అప్పుడే పూజలు మొదలుపెట్టేశారు. పలుచోట్ల యజ్ఞ యాగాదులను నిర్వహిస్తోన్నారు. జాతీయ పతాకాలతో పాటు కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఫొటోలను పట్టుకుని ఆలయాల్లో అర్చనలు చేయిస్తోన్నారు.
VIDEO | India vs New Zealand, Champions Trophy Final: Fans offer prayers in Uttar Pradesh's Varanasi, praying for India's victory against New Zealand.#INDvsNZ #CTFinal2025
— Press Trust of India (@PTI_News) March 9, 2025
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/MWXI1OXDcd
ఉత్తరప్రదేశ్ వారణాశి ఆలయంలో ఈ తెల్లవారు జామున హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శివలింగానికి పాలాభిషేకం చేశారు. ఫైనల్స్‌లో భారత జట్టు గెలవాలంటూ ప్రార్థించారు. ప్లేయర్ల పేర్ల మీద అర్చన చేయించారు. అనంతరం 40 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహం ముందు నిల్చుని హనుమాన్ చాలీసా చదివారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications