అంత కోపమేంట్రా అబ్బాయ్ నీకు.. !!

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజే రసవత్తరంగా మారింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టుకు శుభారంభం ఇవ్వడంలో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ విఫలం అయ్యారు. క్రీజ్ లో కుదురుకున్నట్లే కనిపించిన ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు, ఆ తర్వాత మైదానంలో చోటుచేసుకున్న హైడ్రామా ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాయి. వరుస ఫోర్లతో దూకుడు మీద కనిపించిన జైస్వాల్.. అర్ధశతకం సాధించే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండొ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది.

India vs Sri Lanka 2 test day 1 Yashasvi Jaiswal and Asitha Fernando Heated Exchange Boils and Highlight

ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో ఫెర్నాండొ వేసిన మొదటి మూడు బంతులను జైస్వాల్ వరుసగా బౌండరీలకు తరలించి, దూకుడు మీద కనిపించాడు. అదే ఓవర్ చివరి బంతికి ఫెర్నాండొ బౌన్ బ్యాక్ అయ్యాడు. రౌండ్ ది వికెట్ వచ్చి గుడ్ లెంగ్త్‌లో వేసిన డెలివరీ.. పిచ్ కాగానే వేగంగా లోపలికి దూసుకొచ్చింది. దీనిని జైస్వాల్ ఆఫ్ సైడ్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు గానీ సాధ్యపడలేదు. బంతి బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ నేరుగా వికెట్లను గిరాటేసింది.

64 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్: స్టార్క్ నిప్పు కణికలు
64 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్: స్టార్క్ నిప్పు కణికలు

వికెట్ తీసిన ఆనందంలో శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండొ చాలా దూకుడుగా సంబరాలు చేసుకుంటూ, జైస్వాల్ వైపు చూసి పెవిలియన్ వెళ్లాలంటూ సైగలు చేశాడు. దీనిపై జైస్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తోన్న అతను వెనక్కి తిరిగి ఫెర్నాండొ వైపు దూసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరింది. అదే సమయంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, కమిందు మెండిస్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపించారు.

కొండా సురేఖ వ్యవహారంలో అనూహ్య పరిణామం.. !!
కొండా సురేఖ వ్యవహారంలో అనూహ్య పరిణామం.. !!

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయాడు. 33 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. భారత ఓపెనర్లు ఇద్దరూ త్వరగా అవుట్ కావడంతో మిడిలార్డర్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+