ఆ ఆల్ రౌండర్ అవుట్.. నితీష్ రెడ్డి ఇన్: వెస్టిండీస్ తో నేడే మూడో టీ20: మళ్లీ పరుగుల జాతరే?

రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కొట్టిఅవతల పడేసింది. సంచలన విజయం అందుకుంది. ఈ గెలుపుతో అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కరీబియన్లు 1-1తో సమం చేశారు. నేడు మూడో మ్యాచ్ జరుగనుంది. ఇండోర్‌ హోల్కర్ స్టేడియం దీనికి వేదిక. దీనిపైనా అనేక అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కూడా పరుగుల వరద పారుతుందని, హైస్కోరింగ్ అవుతుందని భావిస్తోన్నారు.

రెండో టీ20లో ఓటమి ఎదురైనప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ సంజూ శామ్సన్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించం ఖాయంగా కనిపిస్తోంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 43 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

India vs West Indies 3rd T20I Predicted Playing 11 as Nitish Kumar Reddy likely replace Shivam Dube

బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నందున ఈ విషయంలో ఎటువంటి ప్రయోగాలకు కూడా సిద్ధపడకపోవచ్చు టీమిండియా మేనేజ్మెంట్. టాప్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు జరక్కపోవచ్చు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ ధాటిగా ఆడుతోన్నారు. శ్రేయస్ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించగా, రెండో టీ20లో 18 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. తిలక్ వర్మ కూడా 18 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి
సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి

ఆల్‌రౌండర్ శివమ్ దూబే పేలవ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. రాంచీ మ్యాచ్‌లో దూబే చేసింది ఏడు పరుగులు మాత్రమే. పైగా బౌలింగ్‌లో రెండు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు. అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జట్టులో మరో ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌కు బ్యాటింగ్ అవకాశం ఎక్కువగా రాకపోయినా, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. అతను తుది జట్టులోనే కొనసాగవచ్చు.

కాచిగూడలో రైలెక్కిన అమ్మోరు
కాచిగూడలో రైలెక్కిన అమ్మోరు

స్పిన్ డిపార్ట్మెంట్ ను అక్షర్ పటేల్ లీడ్ చేయనున్నాడు. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో అతని అనుభవం అవసరమౌతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో దిగొచ్చు టీమిండియా. దీనికోసం స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో కుల్‌దీప్ ఒక వికెట్ తీసినప్పటికీ, పిచ్ పరిస్థితుల దృష్ట్యా అదనపు పేసర్‌ను తీసుకోవాలని భావిస్తోంది జట్టు.

రష్యాపై ట్రంప్ నిర్ణయానికి చెక్: కదులుతున్న పావులు: త్వరలో.. !!
రష్యాపై ట్రంప్ నిర్ణయానికి చెక్: కదులుతున్న పావులు: త్వరలో.. !!

ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. మయాంక్ యాదవ్ తొలి ఓవర్లోనే వికెట్లు తీస్తూ కొత్త బంతితో ప్రభావం చూపుతున్నాడు. ఇండోర్ లో బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడంపై టీమిండియా బౌలర్లు శ్రమించాల్సి ఉంటుంది.

మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో.. సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, శివం దూబే/నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+