india vs zimbabwe: భారత్-జింబాబ్వే మ్యాచ్ వేళ ట్విస్ట్..! చేపాక్ పిచ్ పై కెమికల్ స్ప్రే..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)సూపర్ 8 తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే వరుస విజయాలతో ఇంగ్లాండ్ సెమీస్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ పోటీలో ఉన్నాయి. ఆ తర్వాత స్ధానంలో భారత్ ఉంది. ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో చెన్నై చేపాక్ స్టేడియంలో ఇవాళ జరిగే సూపర్ 8 మ్యాచ్ లో జింబాబ్వేతో భారత్ (india vs zimbabwe) తలపడుతోంది. ఈ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కమ్ ఆతిధ్య దేశం కూడా అయిన భారత్ కు చావోరేవోగా మారడంతో బీసీసీఐ, ఐసీసీ కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
చెన్నై చేపాక్ స్టేడియంలో ముఖ్యంగా పిచ్ విషయంలో ఐసీసీ కీలక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా రూపొందించిన, దేశవాళీ మ్యాచ్ లకు వాడని కొత్త పిచ్ ను భారత్-జింబాబ్వే మ్యాచ్ కు అందుబాటులో ఉంచుతోంది. దీనిపై బంతి నేరుగా బ్యాట్ పైకి వస్తుందని, భారత బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంలో భారత్ ను దాటి జింబాబ్వే బ్యాట్స్ మెన్ మ్యాజిక్ చేయలేరనేది ఐసీసీ, బీసీసీఐల అంచనా అని తెలుస్తోంది.

అదే సమయంలో ఈ పిచ్ పై చల్లేందుకు అమెరికా నుంచి కెమికల్ స్ప్రే తెప్పించారట. రాత్రి సమయంలో చేపాక్ స్టేడియంలో మంచు కురిసే అవకాశం ఉంది. దీని వల్ల భారత్-జింబాబ్వే మ్యాచ్ ఫలితం తారుమారు కాకుండా ఉండేందుకు ఇలా అమెరికా నుంచి తెప్పించిన డ్యూక్యూర్ పేరుగల కెమికల్ స్ప్రేను పిచ్ పై చల్లుతున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ స్ప్రే వాడతారని తెలుస్తోంది. రెండు రోజులుగా ఈ స్ప్రేను వాడుతున్నారని సమాచారం. ఇవాళ మధ్యాహ్నం కూడా జల్లుతారని స్టేడియం వర్గాలు తెలిపాయి. చేపాక్ లో ఉండే జారుడు పిచ్ , బంతి మలుపుల్ని బట్టి బ్యాటింగ్ కు చాలా ఓపిక కావాలి. దాన్ని అధిగమించేందుకు ఇలా స్ప్రే వాడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications