విశ్వవిజేత భారత్.. జయహో వండర్ వుమెన్

అండర్ -19 ఉమెన్స్ టీ20 లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 2025 వరల్డ్ కప్ లో గెలిచింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్​ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ సాధించిన సఫారీ జట్టు కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. మన బౌలర్లు సఫారీ జట్టుపై విజృంభించారు.త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ దక్కించుకున్నారు.దీంతో సౌతాఫ్రికా జట్టు కేవలం 82 పరుగులే చేసి ఆలౌట్ అయింది.

ఇక సఫారీలు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 11.2 ఓవర్లలో 1 వికెట్​ కోల్పోయి ఛేదించారు. తొలి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష (44 పరుగులు; 33 బంతుల్లో: 8x4) దూకుడుగా ఆడి అదరగొట్టింది. సనికె చక్లె (26 పరుగులు)కూడా రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రెనెకె 1 వికెట్ దక్కించుకుంది.

India Wins Under-19 Women s World Cup Defeats South Africa by 9 Wickets

ఈ విజయంతో భారత్ రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది.తెలుగు క్రీడాకారిణి గొంగడి త్రిష టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+