నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచే జట్టుకు దరిద్రం తగులుకుంది..!
అంతన్నాడు, ఇంతన్నాడే రాంబాబు.. ముంత కింద మామిడి పండు అన్నాడో రాంబాబు అన్నట్టుగా ఉంది టీమిండియా కోచ్ గౌతం గంభీర్ పరిస్థితి. ఒకప్పుడు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్ ఎంతటి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడో అందరికి తెలిసిందే. భారత జట్టు టీ20 వరల్డ్ కప్,వన్డే వరల్డ్ కప్ గెలవడంలో గౌతం గంభీర్‌దే కీలక పాత్ర. ఒత్తిడిని జయించి ఫైనల్ మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు ప్రపంచ కప్‌లు అందించాడు. ఇప్పుడు అదే గౌతం గంభీర్‌పై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గౌతం గంభీర్ ప్రస్తుతం టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు గౌతం గంభీర్ పలు ఐపీఎల్ టీంలకు కోచ్‌గా పని చేశారు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో , గౌతం గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టారు. గంభీర్ ఏ మూహార్తనా టీమిండియాకు కోచ్‌గా మారాడో కానీ, భారత జట్టు చరిత్రలో ఎప్పుడూ చూడని పరాజయాలను చవి చూస్తోంది. ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక చేతిలో టీమిండియా దారుణ ఓటమిని చవి చూసింది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేను డ్రా చేసుకున్న భారత జట్టు, తర్వాత రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ల స్పిన్ దాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు పెవిలయన్‌కు క్యూ కట్టారు. రోహిత్, విరాట్ కోహ్లిలు జట్టులో ఉన్నప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై శ్రీలంక సిరీస్ నెగ్గగలిగింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో చేజార్చుకుంది. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ టీం భారత జట్టుపై మ్యాచ్ గెలవడమే కాకుండా, సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌ను ఆడుతోంది. మొదటి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా , రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం సాయంతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్న రోహిత్ సేన, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది.
కెప్టెన్‌గా, ప్లేయర్‌గా రెండింటిల్లోనూ రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ప్రణాళిక లేకుండా జట్టును ముందుకు తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తోంది.విజయం సంగతి పక్కన పెడితే కనీసం డ్రా కోసం ట్రై చేస్తున్నట్టు ఏ ఆటగాడు కనపించలేదు.గౌతమ్ గంభీర్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తర్వాత, టీమిండియా చరిత్రలో పలు ఘోర పరాజయాలను చవిచూసింది. గౌతమ్ గంభీర్ తక్కువ వ్యవధిలోనే టీమ్ ఇండియాకు ఎన్నో అవమానకరమైన రికార్డులను అందించాడు. దీంతో అతన్ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉంటే ఇంకెన్ని దారుణ ఓటములు చూడాలో అని క్రికెట్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications