ప్రమోషన్ కొట్టేసిన టీమిండియా స్టార్ క్రికెటర్
భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య, నటి అతియా శెట్టి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "మా జీవితాల్లోకి ఓ అద్భుతం వచ్చేసింది. మాకు ఆడబిడ్డ పుట్టింది" అని రాసుకొచ్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని రాహుల్ తెలిపారు. ఈ శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు, సహచర క్రికెటర్లు, సినీ ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మొదట్లో స్నేహితులుగా ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ పరిచియం ప్రేమగా మార్చుకున్నారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి గురించి అనేక రుమార్స్ తెర మీదకు వచ్చినప్పటికీ ..వాటిపై ఎప్పుడు ఈ జంట స్పందించింది లేదు. 2021లో కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. నాలుగేళ్లు అతియా శెట్టితో డేటింగ్ చేసిన కేఎల్ 2023లో ఆమెను వివాహం చేసుకున్నాడు.

భారతీయ సంప్రదాయం ప్రకారం రాహుల్- అతియాల పెళ్లి జరిగింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచులు జరుగుతున్న సమయంలో అతియా గ్రౌండ్‌కు వచ్చి మరీ తన భర్త టీంకు సపోర్ట్ చేస్తుంటుంది. ఇక కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెరెంట్స్‌గా మారడంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications