ఇతన్నా కావ్య పాప వద్దనుకుంది..హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన భారత క్రికెటర్
మయాంక్ అగర్వాల్ ..భారత్ క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచియం చేయాల్సిన అక్కర్లేని పేరు. మయాంక్ అగర్వాల్, భారతీయ క్రికెట్ జట్టుకు చెందిన ఒక ప్రతిభావంతుడైన క్రికెట్ ఆటగాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన ఆకర్షణీయమైన బ్యాటింగ్ శైలి, అద్భుతమైన షాట్‌లు మరియు అంతులేని శక్తితో అభిమానులను తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మయాంక్ అగర్వాల్ స్థాయి తగ్గట్టు రాణించడం లేదు.
దీంతో భారతీయ క్రికెట్ జట్టుతో పాటు, ఐపీఎల్‌లో కూడా చోటును కోల్పోయాడు.మయాంక్ అగర్వాల్ తన ఐపీఎల్ జర్నీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ప్రారంభించాడు. తర్వాత, పంజాబ్ కింగ్స్‌కు మారాడు. పంజాబ్ కింగ్స్‌లో ఆయన కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆయన ఐపీఎల్‌లో అనేక అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మయాంక్ అగర్వాల్ ఎస్ఆర్‌హెచ్ టీంలో లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఇటీవల జరిగిన వేలంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడానికి ఏ ప్రాంచేజీ కూడా ముందుకు రాలేదు.

దీంతో అన్‌సోల్డ్ ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. ఐపీఎల్ వేలంలో తనని ఎవరూ కొనుగోలు చేయలేదనో లేక తనని తాను నిరూపించుకోవాలని భావించాడో తెలియదు కానీ విజయ్ హజారే టోర్నీలో మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. కర్ణాటక కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ వరుస సెంచరీలతో అదరగోడుతున్నాడు.పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన మయాంక్ ఇప్పుడు మూడో సెంచరీని నమోదు చేశాడు.
హైదరాబాద్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.112 బంతుల్లో 2 సిక్సర్లు, 15 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. దీంతో ప్రస్తుత విజయ్ హజారే టోర్నీలో వరుసగా మూడు సెంచరీలు బాదిన హీరో అయ్యాడు. మయాంక్ అగర్వాల్ వీర విహారంపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కావ్య పాప ఇలాంటి ఆటగాడినా వద్దనుకుంది అంటూ నెటిజన్లు మయాంక్ అగర్వాల్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications