Anaya Bangaru: అమ్మాయిగా మారిన భారత క్రికెటర్ కొడుకు..!

కొంత మంది మగవారిగా పుట్టినా వారిలో హావభావాలన్ని ఆడవారి ఉంటాయి. అయితే ఇది వారి తప్పు కాదు. కానీ చాలా మంది వారని అంటరాని వారిగా చూస్తారు. ఇంట్లో నుంచి తరిమేస్తారు. దీంతో వారు వారి లాంటి వారితో కలిసి రోడ్లు, రైళ్లలో అడుక్కుంటారు. అయితే ఇందులో కొంత మంది చదువుకుని మంచి హోదాలో ఉంటున్నారు. పోలీసులు, డాక్టర్లు అవుతున్నారు. ఇలాంటి వారి పట్ల సమాజం ఇప్పుడిప్పుడే తన తీరును మార్చుకుంటుంది. ఫారిన్ దేశాల్లో ఇలాంటి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడుపుతారు.

కానీ మన దేశంలో అలా లేదు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా ఇండియన్ క్రికెటర్ కొడుకు లింగ మార్పిడి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సెక్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఆర్యన్ వయస్సు 23 ఏళ్లు. అతను హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకన్నాడు. తన పేరున అనయ బంగర్ గా మార్చుకున్నాడు కూడా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 10 నెలల సమయంలో తనలో హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని వివరించాడు.

Indian cricketer Sanjay Bangaru s son underwent a sex transformation

అబ్బాయి నుంచి అమ్మాయిగా ఎలా మారాడో వివరించాడు. తను తీసుకున్న ఈ నిర్ణయంతో ఆనందగా ఉన్నాని పేర్కొన్నాడు. ఆర్యన్ బంగర్ క్రికెట్ పై ఇష్టంతో క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి వద్ద పాఠాలు కూడా నేర్చుకున్నాడు. లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడాడు. సడన్ గా "శారీరకంగా బలాన్ని కోల్పోయి సంతోషంతో ఉన్నా. నేను వేసే ప్రతీ అడుగు నాకు బాగా నచ్చుతోంది. నా శరీరం పూర్తిగా మారిపోయి నాలోని అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుతోంది" అని పోస్ట్ చేశాడు.

ఇక సంజయ్ బంగారు విషయానికి వాస్తే.. అతను జాతీయ జట్టుకు సేవలు అందించాడు. 2001 నుంచి 2004 వరకు ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ కాలంలో 15 వన్డేలు, 12 టెస్ట్ లు ఆడాడు. కొద్ది రోజులు భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందించాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+