అంత ఈజీ కాదు - గెలవాలంటే, తేల్చేసిన గిల్..!!
India Vs Pakistan: మరో దాయాదుల సమరం. అసలైన సండే బిగ్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ కొన సాగుతోంది. దుబాయ్ వేదికగా భారత్ - పాక్ మ్యాచ్ పై కోట్లాది ఫ్యాన్స్ ఉత్కంఠగా వేచి చూస్తు న్నారు. 2017 ఫైనల్ లో ఓడిన దానికి దుబాయ్ వేదికగా ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన కసితో కదులుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమీండియాకు సెమీస్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. పాక్ టీం సైతం అదే పట్టుదలతో ఉంది. పిచ్ కండీషన్లు చూసిన తరువాత గెలుపు ఎవరికీ అంత సులువు కాదనేది అర్దమవుతోంది. గిల్ అసలు విషయాన్ని బయట పెట్టారు.
గిల్ అంచనాలు
పాకిస్థాన్ పైన విజయం కోసం రోహిత్ సేన ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కోహ్లీ టీం సభ్యుల కంటే ఎక్కువగా చెమటోస్తున్నారు. స్నిన్నర్లు ఈ మ్యాచ్ లో తమ సత్తా చాటటం ద్వారా మొత్తం ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉంది. ప్రాక్టీసు పంత్ దూరంగా ఉన్నాడు. వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్న పంత్ ప్రాక్టీసుకు రాలేదని తెలుస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ కు పంత్ ఆడుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. పంత్ ఫిట్ గా ఉంటేనే తుది జట్టులో ఉండే అవకాశం ఉంటుందని వైస్ కెప్టెన్ గిల్ తేల్చి చెప్పారు. ఇక, గిల్ దుబాయ్ పిచ్ కండీషన్లతో పాటుగా రెండు జట్లలో బలాబలాల గురించి ఆసక్తి కర అంశాలను వెల్లడించారు.

అంత సులభం కాదు
దుబాయ్ లో టాస్ కీలకం కాదని గిల్ విశ్లేషణ చేసారు. ఈ పిచ్ పైన డ్యూ ఫ్యాక్టర్ లేదని చెప్పారు. ఇక్కడ ఛేజింగ్ కష్టమని వివరించాడు. ఇది ఎంతో ముఖ్యమైన మ్యాచ్ గా రెండు దేశాలతో పాటుగా యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. మంచు లేకుండా ఫ్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయ డం అంత ఈజీ కాదని కుండ బద్దలు కొట్టాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా సులభం కాదని వివ రించాడు. మిడిల్ ఓవర్లలో ఎవరు బాగా రాణిస్తారో వారికే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని గిల్ తేల్చేసాడు. ఈ సారి కచ్చితంగా తాము దూకుడుగా ఆడాలనే అనుకుంటున్నట్లు వివరించాడు.
ఇదీ మా వ్యూహం
పిచ్ ఎలా స్పందిస్తుంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని గిల్ పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై మేం 300 లేదా 280 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నట్లు అంచనా గా చెప్పారు. పిచ్ సపోర్ట్ చేస్తే 350-360 పరుగులు చేస్తామని గిల్ అసలు వ్యూహాన్ని బయట పెట్టాడు. ఇక, తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పాకిస్థాన్ పైన రెట్టించిన ఉత్సాహంతో బరి లోకి దిగుతోంది. రెండు టీంలు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం గట్టి పట్టుదలతో ఉండటంతో.. తొలి బంతి నుంచే ఈ మ్యాచ్ మజా ఆస్వాదించేందుకు కోట్లాది మంది ఫ్యాన్స్ సిద్దమైపోయారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications