రోహిత్ శర్మ ఖాతాలో మరో కప్..!
ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తద్వారా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై టీమిండియా బంపర్ వికర్టీ సాధించింది.
కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో రాహుల్, పాండ్యా మెరుపులతో భారత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కింది.రోహిత్ , గిల్ 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు.

దీంతో టీమిండియా గెలుపు లాంఛనమే అని అనుకున్నారు. కానీ గిల్,కోహ్లి వరుసగా పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా ఒత్తిడిలోకి వెళ్లింది.అర్థ సెంచరీ పూర్తి చేసి మంచి జోరు మీద కనిపించిన రోహిత్ శర్మ సైతం 76 పరుగల వద్ద స్టెంప్ అవుట్ అయ్యాడు.ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో భారత జట్టు తిరిగి రేసులోకి నిలబడింది. 48 పరుగుల చేసిన శ్రేయాస్ అయ్యర్ అవుట్ కావడం, ఆ వెంటనే అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి.
ఇటువంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్, పాండ్యాతో కలిసి నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించాడు. చివర్లో పాండ్యా అవుట్ అయినప్పటికీ మిగిలిన తతంగాన్ని రాహుల్ పూర్తి చేశాడు. తద్వారా 10 ఏళ్ల తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలవగా, అతని కెప్టెన్సీలోనే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని సైతం సొంతం చేసుకుంది. తద్వారా రెండు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.












Click it and Unblock the Notifications