స్కూల్ క్రష్‌ను పెళ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్
Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు, మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. ఇప్పటికే మెగా ఆక్షన్ కూడా పూర్తయింది. దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలంపాట కోలాహలంగా సాగింది. చాలామంది ప్లేయర్లు ఫ్రాంఛైజీలు మారిపోయారు. అటు ఇటు అయ్యారు.

ఐపీఎల్ సమీపిస్తోన్న నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్టార్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే పెళ్లి పీటలు ఎక్కాడు. ఒకింటి వాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ క్రష్ నభా గడ్డమ్వార్‌ను పెళ్లాడాడు. ముంబైలో జరిగిన ఈ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. మరాఠీ సంప్రదాయంలో ఈ వివాహం జరిగింది.

2020లో ఐపీఎల్ టోర్నమెంట్‌లో అడుగుపెట్టాడు తుషార్ దేశ్‌పాండే. కుడిచేతివాటం ఫాస్ట్ బౌలర్. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లను ఆడాడు. 25 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/45. 10.13 ఎకానమీతో అతని బౌలింగ్ సాగుతోంది. ఐపీఎల్ 2023 ఒక్క సీజన్‌లోనే 16 మ్యాచ్‌లల్లో 21 వికెట్లను నేలకూల్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బౌలర్‌గా ఎదిగాడు.












Click it and Unblock the Notifications