ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ ఆడబోయేవి ఈ జట్లే: సూపర్ స్టార్
IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవరి ముంబై ఇండియన్స్.. తన నాలుగో మ్యాచ్ ఆడుతోంది. వాంఖెడే స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడుతోంది. ఈ సాయంత్రం జరిగే మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టబోతోంది గుజరాత్ టైటాన్స్.
ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. తొలి ఏడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ దుమ్ము లేపాడీ మ్యాచ్‌లో. 27 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టిన హిట్ మ్యాన్.. 49 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఏడో ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్ నుంచి దూసుకొచ్చిన క్వికర్‌ను బ్యాక్‌ఫుట్‌పై ఆడబోయాడు రోహిత్ శర్మ. టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీనితో 80 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. సూర్యకుమార్ యాదవ్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది ముంబై.
ఎన్రిచ్ నోర్ట్జే వేసిన ఓవర్ అది. మిడిల్, లెగ్ స్టంప్ మీద పిచ్ అయిన బంతిని మిడాన్ దిశగా గాల్లోకి లేపాడు సూర్యకుమార్ యాదవ్. అక్కడే పొంచివున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.. వెనక్కి పరుగెత్తుతూ బంతిని అందుకున్నాడు. దీనితో 81 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.
కాగా- ఐపీఎల్ 2024 కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ మీద అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొందరు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు ప్లేఆఫ్స్ గురించి తమ అంచనాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, మైకెల్ వాన్, సైమన్ డౌల్.. వంటి మాజీలు తమ అంచనాలను బయటపెట్టారు.
Akshay Kumar picking Punjab Kings, RCB, DC and Mumbai Indians as his Top 4. (Star Sports). pic.twitter.com/Zr1DRTHyjL
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024
తాజాగా- బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌పై తన మనస్సులో ఉన్న మాటలను వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమానికి అతను అటెండ్ అయ్యాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, హీరో టైగర్ ష్రాఫ్‌తో ఇందులో పాల్గొన్నాడతను.
ఈ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్స్ చేరుకుంటాయని అంచనా వేశాడు. ఈ నాలుగు జట్లకు ఆ సామర్థ్యం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ అట్టడుగున ఉన్నప్పటికీ- ఈ రెండూ కూడా మున్ముందు మంచి విజయాలు అందుకుంటాయని అన్నాడు.












Click it and Unblock the Notifications