ఐపీఎల్‌లో షమార్ జోసెఫ్ ఎంట్రీ: రూ.3 కోట్లతో డీల్ సెట్ చేసిన టాప్ ఫ్రాంఛైజీ
Shamar Joseph: వెస్టిండీస్ బౌలింగ్ సంచలనం షమర్ జోసెఫ్. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ గడ్డపైనే మట్టి కరిపించిన ఘనుడు. గబ్బా స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒంటి చేత్తో వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. రెండో ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచాడు. నిప్పు కణికల్లాంటి బంతులను సంధించాడు. ఏడు వికెట్ల నేలకూల్చాడు.
వెస్టిండీస్ గడ్డపై పెరిగిన క్రికెటర్లల్లో బౌలింగ్ సత్తా ఇంకా తగ్గలేదనే సందేశాన్ని పంపించాడు. షమర్ జోసెఫ్ వల్ల.. దాదాపుగా 30 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. టెస్టుల్లో మళ్లీ పూర్వవైభవాన్ని అందుకునే పట్టుదలను పెంచిందా గెలుపు.

ఆ డైనమిక్ బౌలర్.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో అడుగుపెట్టాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడబోతోన్నాడు. ఈ మేరకు లక్నో జెయింట్స్ ఫ్రాంఛైజీ.. అతనితో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటనను విడుదల చేసింది.
మూడు కోట్ల రూపాయలతో జోసెఫ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. షమర్ జోసెఫ్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. తొలి సీజన్‌లోనే మూడు కోట్ల రూపాయలతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినట్టయిందతనికి. ఇది రీప్లేస్‌మెంట్. గాయపడ్డ మార్క్ వుడ్ స్థానంలో షమర్ జోసెఫ్‌ను తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్.
ఐపీఎల్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మార్చి మూడో వారంలో ఈ సీజన్ ఆరంభమౌతుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి.
ఐపీఎల్ ఆడే అన్ని జట్లు కూడా సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలకడం, మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications