మెంటార్ సచిన్ టెండుల్కర్‌పైనా వేటు వేసిన ముంబై ఇండియన్స్: క్లారిటీ ఏంటీ?
Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలను సృష్టించింది. కేప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేయడం అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను అపాయింట్ చేయడం కలకలం రేపింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆ ఫ్రాంఛైజీపై నిప్పులు చెరుగుతున్నారు.

ఐపీఎల్ టోర్నమెంట్లల్లో అత్యధికంగా అయిదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను అత్యంత అవమానకరంగా కేప్టెన్సీ స్థానం నుంచి తప్పించిందంటూ ధ్వజమెత్తుతున్నారు. అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని, వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఆడకూడదనీ కోరుకుంటోన్నారు.
ఈ విమర్శలపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. సారధి మార్పునకు గల కారణాలపై వివరణ ఇవ్వలేదు. కేప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మకు ముందుగానే ముంబై ఇండియన్స్ సమాచారం ఇచ్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.

అదే సమయంలో మరిన్ని విమర్శలను ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్. టీమ్ మెంటార్‌గా వ్యవహరిస్తోన్న సచిన్ టెండుల్కర్‌పైనా వేటు వేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మెంటార్ హోదా నుంచి సచిన్‌ను తొలగించిందని, ఇప్పటికిప్పుడు ఈ ఖాళీని భర్తీ చేయకపోయినా మెగా ఆక్షన్ తరువాత కొత్త అపాయింట్‌మెంట్ ఉండొచ్చనేది వాటి సారాంశం.
దీనిపై ముంబై ఇండియన్స్ రియాక్ట్ అయింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని వివరణ ఇచ్చింది. అభిమానులెవరూ ఈ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. సచిన్ ఇప్పటికీ తమ జట్టుతోనే ఉన్నాడని, ఆయన మెంటార్‌గా కొనసాగుతారని తెలిపింది. జట్టు సాధించే విజయాల్లో సచిన్ పాత్ర విస్మరించలేనిదని పేర్కొంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications