టీమిండియా మెగా స్టార్ కోసం ఆ జట్ల మధ్య పోటాపోటీ

IPL 2025 auction venue: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.

ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ వచ్చాడు. ఈ టీమ్ మెంటార్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో అపాయింట్ అయ్యాడు.

IPL 2025 auction CSK Mumbai Indians and Gujarat Titans have interest in Washington Sundar

గుజరాత్ టైటాన్స్‌‌లోనూ ఇదే తరహా మార్పులు జరగొచ్చంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని గుజరాత్ టైటాన్స్ మొదట్లో నిర్ణయించుకున్నప్పటికీ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆశీష్ నెహ్రాను కొనసాగించబోతోంది.

లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. తన సొంత రాష్ట్రానికి వస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరొచ్చనీ అంటున్నారు. ఇలాంటి అనేక మార్పులు- నెక్స్ట్ సీజన్ కోసం నిర్వహించే వేలంపాటలో చూడొచ్చు.

ఈ మెగా ఆక్షన్‌లో భారత జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడీ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. అతన్ని రిటైన్ చేసుకోవట్లేదంటూ వార్తలొస్తోన్నాయి. అతన్ని రిలీజ్ చేస్తే మూడు జట్లు మెగా ఆక్షన్‌లో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్.. వాషింగ్టన్ సుందర్‌‌ను తమ జట్టులో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తోన్నాయంటూ సమాచారం. దీనికి కారణాలు లేకపోలేదు. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ప్రదర్శన- ఈ మూడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను కట్టిపడేసింది.

పుణే టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ- బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్‌లో ఏకంగా ఏడు వికెట్ల పడగొట్టాడు. రెండో ఇన్నింగ్‌లో మరో నాలుగు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 115 పరుగులు ఇచ్చి 11 వికెట్లు తీసుకున్నాడు.

వాషింగ్టన్ సుందర్ చెన్నైకి చెందిన వాడు కావడం, చెపాక్ పిచ్ కొట్టినపిండి కావడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ అతని కోసం ఎంత మొత్తమైనా ధారపోయవచ్చని తెలుస్తోంది. పవర్ ప్లేలో అతని బౌలింగ్ సేవలను వినియోగించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. రషీద్ ఖాన్‌కు సుందర్ జత అయితే అగ్నికి వాయువు తోడైనట్టవుతుందని గుజరాత్ టైటాన్స్ అంచనావేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+