ఒక సింహం.. ఇంకో సింహం మీద స్వారీ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా?
CSK vs RCB: ఐపీఎల్ 2025లో ఇంకో కీలక మ్యాచ్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు దాదాపుగా ఏకపక్షమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్, ఆ తరువాత బౌలింగ్‌లో దుమ్ము దులిపింది. సీఎస్‌కే కట్టడి చేసింది. 50 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.
శుక్రవారం రాత్రి చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేప్టెన్ రజత్ పటిదార్ టాప్ స్కోరర్. సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. 32 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఫిల్ సాల్ట్- 32, విరాట్ కోహ్లీ- 31, దేవదత్ పడిక్కల్- 27 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఎనిమిది బంతుల్లో మూడు బ్యాక్ అండ్ బ్యాక్ సిక్సర్లు బాదాడు. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్.. తన ప్రత్యర్థి ముందు భారీగా పరుగులు సమకూర్చిపెట్టగలిగింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. తడబడింది. విజయాన్ని అందుకోలేక చతికిలపడింది. 146 పరుగుల వద్దే ముగిసిందా జట్టు ఇన్నింగ్. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగులే చేయగలిగింది. భారీ భాగస్వామ్యాలను నిర్మించలేకపోయారా జట్టు బ్యాటర్లు.

జట్టు స్కోర్ ఎనిమిది పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. వెటరన్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ- రవీంద్ర జడేజా మధ్య ఏర్పడిన 31 పరుగుల భాగస్వామ్యమే అధికం అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను సాధించినట్టయింది ఆర్సీబీకి. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించడానికి 17 సంవత్సరాలు పట్టింది. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో చెపాక్‌లో సీఎస్‌కేను ఓడించింది బెంగళూరు. ఆ తరువాత ఇంకెప్పుడే గానీ విజయం అనేదే దక్కలేదు. దీనికి తాజాగా పుల్ స్టాప్ పెట్టింది.
ఈ గెలుపు తరువాత సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు చురకలు అంటిస్తూ వందల పోస్టులు పెడుతున్నారు ఆర్సీబీ అభిమానులు. ఒక సింహం మరో సింహం మీద స్వారీ చేసిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ రెండు జట్ల అఫీషియల్ ఎంబ్లమ్‌లో సింహం ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications