IPL 2025: 'చూసేకి అగ్గి రవ్వలా'.. శ్రేయా గాత్రం, దిశా సిజ్లింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఐపీఎల్ షురూ

IPL 2025:ఐపీఎల్ 2025లో భాగంగా ప్రారంభ వేడుక ఘనంగా జరిగింది. 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్ ఐకానిక్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. ప్రారంభోత్సవ వేడుకలో పలువురు కళాకారుల ప్రదర్శనలతో స్టేడియం మారుమ్రోగింది. ముందు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభోత్సవంలో ఎవరెవరు ప్రదర్శన ఇస్తారో షారుఖ్ వివరించారు. అనంతరం శ్రేయా ఘోషల్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. శ్రేయా ఘోషల్ గాత్రానికి ఫ్యాన్స్ మైమరిచిపోయారరు. ఈ క్రమంలో మైదానం అంతా కాంతులతో రంగులమయమైంది. మొదటి దేశ భక్తి గీతాన్ని ఆలపించిన శ్రేయా.. భూల్ భూలయ్యాలోని పాటతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. దీని తర్వాత సంజు చిత్రంలోని కర్ హర్ మైదాన్ ఫతే పాటతో అలరించింది. అనంతరం సూపర్ హిట్ చిత్రమైన పుష్పలోని 'చూసేకి అగ్గి రవ్వలా' పాటను ఆలపించింది.

శ్రేయా పాటలు పాడిన తర్వాత బాలీవుడ్ నటి దిశా పటానీ తన డ్యాన్స్ తో అభిమానులను అలరించింది. దిశా వేదికపై వివిధ పాటలకు డ్యాన్స్ చేసింది. దిశా అద్భుతమైన ప్రదర్శన వేదికను ఊపేసింది. దిశా పటానీ తన ప్రదర్శన సమయంలో అద్భుతమైన దుస్తులను ధరించింది. ఇందులో ఆమె తెల్లటి రంగు వెస్ట్రన్ టూ పీస్ డ్రెస్‌లో కనిపించింది. ఈ డ్రెస్ లో దిశా చాలా అందంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను ప్రజలు చాలా ప్రశంసిస్తున్నారు. అనంతరం ప్రముఖ గాయకుడు, రాపర్ కరణ్ ఓజ్లా ప్రదర్శన ఇచ్చారు. తన గాత్రంలోత ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అనంతరం విరాట్ కోహ్లీ వేదికపైకి చేరుకున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఒకే టీంకు కోహ్లీ ఆడుతున్నారని షారుఖ్ ఖాన్ అభినందించారు. ఆ సమయంలో కోహ్లీ.. కోహ్లీ అంటూ ప్రేక్షకులు నినాదాలు చేశారు.

IPL 2025 Grand Opening Ceremony with Shreya Ghoshal Disha Patani and Virat Kohli s Stellar Performances

ఆ తర్వాత రింకూ సింగ్ ను వేదికపైకి షారుఖ్ ఆహ్వానించారు. రింకూ సింగ్ ను తన పాట మీద డ్యాన్స్ చేయమని అడిగారు. 'లుట్ పుట్‌ గయా...' అంటూ షారుఖ్‌, రింకుసింగ్‌ వేదిక మీద డ్యాన్స్‌ చేశారు. పటాన్‌ సినిమాలోని 'మేరీజాన్‌' పాటకు డ్యాన్స్ చేయమని విరాట్ ను షారుఖ్ అడిగారు. ఈ క్రమంలో షారుఖ్ తో కలిసి విరాట్ కోహ్లీ చిందేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+