Heinrich Klaasen: ఊచకోతకు సిద్ధంకండి..కాటేరమ్మ కొడుకు ఇక్కడ..!!
Heinrich Klaasen:ఐపీఎల్ సీజన్ 18 మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. గతేడాది టైటిల్ విన్నర్‌గా అవతరించిన కేకేఆర్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతుండగా.. రన్నర్స్ అప్‌గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ జట్టు ఎలాగైనా సరే ఈ సారి టైటిల్‌ను దక్కించుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది.సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా పాప ఈసారి ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందుకే సీజన్ 18 ఆరెంజ్ ఆర్మీ చాలా దుర్భేద్యంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ది డిస్ట్రక్టర్‌గా పేరుగాంచిన కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ఫామ్ ఎలా ఉంది..?
కాటేరమ్మ కొడుకు కరుణిస్తేనే..
కాటేరమ్మ కొడుకు.. క్లాసెన్. ఈ ప్రోటీస్ కాకాను మన సన్‌రైజర్స్ అభిమానులు ముద్దుగా పిలచుకునే పేరు. గతంలో అద్భుతాలు సృష్టించడంతో క్లాసెన్‌ను కావ్యా పాప రిటెయిన్ చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపిన క్లాసెన్ ఈ సారి కూడా అదే కసితో బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసిన మన కాకా.. ఫామ్ కాస్త ఆందోళనకరంగా ఉందనే చెప్పాలి. తాను ఈ మధ్యకాలంలో ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌ల పరిస్థితి గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. సాధారణంగా క్లాసెన్ బ్యాట్ పట్టి పిచ్‌మీదకు వచ్చాడంటే అవతల ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఊచకోతే మరో మాట ఉండదు అంటే నమ్మండి. అలాంటి క్రేజీ క్లాసెన్‌కు సంబంధించి ఫామ్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

సింక్‌లో ఉన్నాడంటే సితకబాదుడే..
ఒక్కసారి క్లాసెన్ బాబాయ్ ఈ మధ్యకాలంలో ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో క్లాసెన్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. అయితే క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. వరుసగా డకౌట్ అయిన ప్లేయర్ ఒకే ఒక మ్యాచ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారగలడు. ఆ తర్వాత వరుస మ్యాచుల్లో పరుగుల వరద పారించగలడు. దటీజ్ ది బ్యూటీ ఆఫ్ క్రికెట్. సో క్లాసెన్ కూడా ఒక్కసారి కన్నెర్ర చేస్తే దీనవ్వా... తగ్గేదేలే అనేలా దూసుకుపోగలడు. సహజంగా చాలా సాఫ్ట్‌గా కనిపించే క్లాసెన్ బ్యాట్ పట్టాడంటే బంతిని వెతుక్కోవాల్సిందే. అలాంటి సత్తా ఉన్నోడు మన చిన్నోడు.
ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ క్లాసెన్
ఇక కేవలం క్లాసెన్ సిక్సుల కోసమే కొందరు అత్యంత ధర ఉన్నప్పటికీ టికెట్ కొనుగోలు చేసి మ్యాచ్ చూసేందుకు వస్తారు. వన్స్ క్లాసెన్ ఔటయ్యాడంటే వారు నిరాశతో స్టేడియం నుంచి తిరిగి వెళ్లిపోతారు. అంతలా కాటేరమ్మ కొడుకుపై ఆశలు పెట్టుకున్నారు మన హైదరాబాదీలు. అయితే వీరి ఆశలను వమ్ము చేయకుండా క్లాసెన్ రెచ్చిపోతే మాత్రం ప్రత్యర్థి జట్టుకు కనీసం.. అంటే కనీసం ఆ విధ్వంసం నుంచి కోలుకునేందుకు ఒక వారం రోజులు పడుతుంది. క్లాసెన్ గానీ ఫామ్‌లోకి వచ్చి బ్యాటు ఝళిపించాడా... ఏ బంతి ఏ మూలన ఎక్కడ పడిందో వెతుక్కునేందుకు రెండ్రోజులు సమయం పడుతుంది. ఈ బిల్డప్ అంతా క్లాసెన్ బాబాయ్ ఫామ్‌లోకి వస్తేనే... లేదంటే ఏముంది గెలుపు కోసం ఇతర ఆటగాళ్లపై ఆధారపడాల్సిందే.
బట్ ఎనీవేస్... ఒక హైదరాబాదీగా.. ఒక సన్ రైజర్స్ అభిమానిగా క్లాసెన్ కాక ఊచకోత కోయాలనే ఆశిద్దాం. తాను తీసుకున్న రూ.23 కోట్లకు న్యాయం చేస్తాడనే భావిద్దాం. ఎందుకంటే ఇది ఆరెంజ్ ఆర్మీ.. లెట్స్ ప్లే విత్ ఫైర్ అంటూ బరిలోకి దిగుతోంది. సనరైజర్ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్టే. కాబట్టి ప్రత్యర్థులు క్లాసెన్ ఫామ్‌లో లేకుండా ఉండాలని నచ్చిన దేవుళ్లకు పూజలు చేసుకోండి.. పొరపాటునో గ్రహపాటునో ఫామ్‌లోకి వచ్చాడా.. చెప్పాల్సిన పనిలేదు. ఓన్లీ దబిడి దిబిడే..!!












Click it and Unblock the Notifications