గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్?

IPL 2025 schedule: ఎంతగానో ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్‌ ఈడెన్ గార్డెన్స్‌ దీనికి వేదిక.

2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

IPL 2025 KL Rahul reportedly rejects Delhi Capitals captaincy new skipper likely Axar Patel

మార్చి 23వ తేదీన అంటే రెండో రోజున తన తొలి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మళ్లీ మే 20వ తేదీన ఈ రెండు జట్లూ మరోసారి తలపడతాయి. మార్చి 8వ తేదీన చెపాక్ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది సీఎస్‌కే. మళ్లీ మే 3వ తేదీన ఈ రెండు జట్లూ ఢీ కొడతాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్‌ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.

ఏప్రిల్ 5న ఢిల్లీ కేపిటల్స్, 11న కోల్‌కత నైట్‌రైడర్స్, 25న సన్‌రైజర్స్ హైదరాబాద్, 30న పంజాబ్ కింగ్స్, మే 12న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది సీఎస్‌కే. లీగ్ దశలో ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఒకే ఒక్క జరుగనుంది. ఏప్రిల్ 7వ తేదీన వాంఖెడే స్టేడియంలో ఈ రెండు జట్ల తలపడతాయి.

ఐపీఎల్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో జట్టు కేప్టెన్ ఎవరనేది తేల్చట్లేదు ఢిల్లీ కేపిటల్స్. కేప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు. కేఎల్ రాహుల్ తాజాగా దీన్ని తిరస్కరించాడు. కేప్టెన్సీ పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు. ఫలితంగా అక్షర్ పటేల్‌ను సెలెక్ట్ చేయడం లాంఛనప్రాయమే అవ్వొచ్చు.

కేఎల్ రాహుల్ ఇప్పటివరకు రెండు ఐపీఎల్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2020-2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, 2022-2024 మధ్యకాలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారధిగా పని చేశాడు. కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డ్ ఉందతనికి. 64 మ్యాచ్‌లల్లో 31 గెలిచాడు. 31 మ్యాచ్‌లు ఓడిపోయాడు. రెండు టై అయ్యాయి. అతని విజయాల శాతం సుమారు 48.43.

అతని నాయకత్వంలో- లక్నో సూపర్ జెయింట్స్ రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది గానీ ఎలిమినేటర్ రౌండ్‌లో ఓడిపోయింది. అక్షర్ పటేల్ ఇప్పటివరకు ఏ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఢిల్లీ కేపిటల్స్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ సీజన్‌లో జట్టు పగ్గాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఢిల్లీ కేపిటల్స్ టీమ్‌లో కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, దర్శన్ నల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, కుల్‌దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, మన్వంత్ కుమార్, దుష్మంత చమీరా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+