ముంబై ఇండియన్స్‌ పెను సంచలనం- సీనియర్‌పై వేటు: కొత్త అపాయింట్‌మెంట్

Mahela Jayawardene: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.

ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు టీమ్ మెంటార్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది.

IPL 2025 Mumbai Indians announced Mahela Jayarwardene as its new head coach

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. గుజరాత్ టైటాన్స్‌‌లోనూ ఇదే తరహా మార్పులు జరగొచ్చంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని గుజరాత్ టైటాన్స్ మొదట్లో నిర్ణయించుకున్నప్పటికీ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆశీష్ నెహ్రాను కొనసాగిస్తోంది.

తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ సారథ్యాన్ని వహిస్తోన్న రిచ్చెస్ట్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌లో ఇలాంటి కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ స్టార్ బ్యాటర్ మహేల జయవర్ధనె నియమితుడయ్యాడు. ఈ మేరకు ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం కొద్దిసేపటి కందటే అధికారికంగా ప్రకటించింది.

IPL 2025 Mumbai Indians announced Mahela Jayarwardene as its new head coach

ప్రస్తుతం మార్క్ బౌచర్.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అధ్వాన్నంగా ఆడిందీ జట్టు. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మొత్తం 10 మ్యాచ్‌లల్లో గెలిచింది నాలుగంటే నాలుగే. ఎనిమిది పాయింట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. దీని ప్రభావం మార్క్ బౌచర్‌పై పడింది. అతన్ని తొలగించింది. మహేల జయవర్ధనెకు కోచ్ పగ్గాలను అప్పగించింది.

అదే సమయంలో ఈ జట్టు బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే అపాయింట్ కానున్నాడు. ఈ మేరకు ఆ ఫ్రాంఛైజీ ఆయనతో సంప్రదింపులు నిర్వహించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడొచ్చు. ప్రస్తుతం లసిత్ మలింగ, టీఏ శేఖర్ ఈ జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్నారు. వారితో జట్టు కట్టనున్నాడు పరాస్ మాంబ్రే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+