ముంబై ఇండియన్స్ కేప్టెన్‌గా సూర్య ఖరార్- ఆ ఒక్కదానికేనా?

Hardik Pandya: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గుడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్‌ ఈడెన్ గార్డెన్స్‌ దీనికి వేదిక.

2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

Hardik Pandya

మార్చి 23వ తేదీన అంటే రెండో రోజున తన తొలి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మళ్లీ మే 20వ తేదీన ఈ రెండు జట్లూ మరోసారి తలపడతాయి. మార్చి 8వ తేదీన చెపాక్ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది సీఎస్‌కే. మళ్లీ మే 3వ తేదీన ఈ రెండు జట్లూ ఢీ కొడతాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్‌ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.

తొలి మ్యాచ్‌లోనే సమవుజ్జీ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టబోతోంది ముంబై ఇండియన్స్. ఇదోరకంగా టఫ్ మ్యాచే అవుతుంది ఈ రెండు జట్లకూ. గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. ఆ గెలుపు ప్రభావం లీగ్ దశ మ్యాచ్‌లపై సానుకూలంగా పడుతుందని అంచనా వేస్తోన్నాయి.

Take a Poll

ఈ పరిస్థితుల మధ్య ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కేప్టెన్ హార్దిక్ పాండ్యా.. జట్టుకు దూరం అయ్యాడు. తొలి మ్యాచ్ ఆడట్లేదు. స్లో ఓవర్ రన్‌రేట్ దీనికి కారణం. స్లో ఓవర్ రన్‌రేట్ వల్ల 2024 సీజన్‌లో ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడీ ఆల్‌రౌండర్. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ అది. ఇందులో లక్నో గెలిచింది.

హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం వల్ల ఇక ప్రత్యామ్నాయంగా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్..కేప్టెన్సీ బాధ్యతలను తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించింది. తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడని వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+