హార్దిక్ పాండ్యా మేజిక్- ముంబై ఇండియన్స్‌లో బిగ్ ఛేంజ్..!!
IPL 2025: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.
ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు టీమ్ మెంటార్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. గుజరాత్ టైటాన్స్‌లోనూ ఇదే తరహా మార్పులు జరగొచ్చంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని గుజరాత్ టైటాన్స్ మొదట్లో నిర్ణయించుకున్నప్పటికీ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆశీష్ నెహ్రాను కొనసాగిస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. తన సొంత రాష్ట్రానికి వస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ సారథ్యాన్ని వహిస్తోన్న రిచ్చెస్ట్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌లో ఇలాంటి కీలక మార్పు చోటు చేసుకోబోతోంది.

ఈ జట్టు బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే అపాయింట్ కానున్నాడు. ఈ మేరకు ఆ ఫ్రాంఛైజీ ఆయనతో సంప్రదింపులు నిర్వహించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడొచ్చు. ప్రస్తుతం లసిత్ మలింగ, టీఏ శేఖర్ ఈ జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్నారు. వారితో జట్టు కట్టనున్నాడు పరాస్ మాంబ్రే.
1996 నుంచి 1998 వరకు భారత్ తరఫున మ్యాచ్‌లను ఆడాడీ రైట్ హ్యాండ్ పేస్ బౌలర్. రెండు టెస్టులు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. మొన్నటి వరకు కూడా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న కాలంలో బౌలింగ్ విభాగాన్ని పర్యవేక్షించింది పరాస్ మాంబ్రేనే.

పదవీ కాలం ముగిసిన తరువాత కాంట్రాక్ట్ గడువును బీసీసీఐ పొడిగించలేదు. దీనితో జట్టు నుంచి బయటికొచ్చారు. తాజాగా ఆయనను బౌలింగ్ కోచ్‌గా నియమించుకోవడానికి ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ సంప్రదింపులు పూర్తిచేసింది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది.
బౌలింగ్ కోచ్‌గా సమర్థవంతంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన పేరును ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి సిఫారసు చేసింది కూడా కేప్టెన్ హార్దిక్ పాండ్యానేనని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో ప్రతికూల పరిస్థితుల్లో ఎలాంటి బౌలర్లు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా బౌలింగ్ చేయడంలో పరాస్ మాంబ్రే పాత్ర కీలకం.












Click it and Unblock the Notifications