ఆర్సీబీ కేప్టెన్‌గా రూ.11 కోట్ల ప్లేయర్: అమ్మో..కప్ కొట్టేద్దామనే

RCB Captain: ఐపీఎల్ 2025 సీజన్‌లో కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త కేప్టెన్‌గా పేరును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. డైనమిక్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పటిదార్‌ను కేప్టెన్‌గా అపాయింట్ చేసింది. ఈ మేరకు బెంగళూరులోని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఫాఫ్ వారసుడిగా..

గత సీజన్ వరకూ రాయల్ ఛాలెంజర్స్‌కు కేప్టెన్‌గా వ్యవహరించాడు ఫాఫ్ డుప్లెసిస్‌. ఈ సీజన్‌లో అతన్ని కంటిన్యూ చేయదలచుకోలేదు. ఈ సీజన్ వేలంపాట కోసం అతన్ని రిలీజ్ చేసింది కూడా. ఆ తరువాత కెప్టెన్సీ పగ్గాలు అనేవి ఎవరికీ దక్కలేదు. కొద్దిరోజుల పాటు విరాట్ కోహ్లీ పేరు వినిపించింది గానీ అది కూడా వాస్తవరూపాన్ని దాల్చలేకపోయింది.

IPL 2025 Rajat Patidar has been named as the captain of Royal Challengers Bengaluru

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో..

ఇప్పుడు తాజాగా ఈ ఐపీఎల్ 2025 సీజన్ కోసం రజత్ పటిదార్‌ను కేప్టెన్‌గా ఎంపిక చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తానుప ప్రాతినిథ్యాన్ని వహించిన మధ్యప్రదేశ్‌ రంజీ జట్టును ఫైనల్స్ వరకూ తీసుకెళ్లగలిగాడు రజత్ పటిదార్. అదే ఇప్పుడతనికి వరమైంది. చక్కగా కలిసొచ్చింది.

2021లో ఐపీఎల్‌లోకి..

2021లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు పటిదార్. అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్‌‌నూ ఎదుర్కొనడంలో సమర్థుడు. ఆర్సీబీ తరపున 27 మ్యాచ్‌లు ఆడాడు. 158.85 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లల్లో పటిదార్ కూడా ఒకడు. విరాట్ కోహ్లీ, యష్ దయాల్ రిటైన్ అయ్యారు అప్పట్లో. అతని రిటైన్‌మెంట్ మొత్తం 11 కోట్ల రూపాయలు.

రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కొత్త దిశానిర్దేశం..

పటిదార్ నియామకం రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కొత్త దిశానిర్దేశం లాంటిదే. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ చాలా సంవత్సరాలుగా జట్టుకు నాయకత్వం వహిస్తూ వచ్చారు. కోహ్లీ మొదటిసారిగా 2011లో స్టాండ్‌బైగా ఆర్సీబీ పగ్గాలు అందుకున్నాడు. 2012లో ఫుల్ టైమ్ కేప్టెన్ అయ్యాడు. 2021 సీజన్ వరకు జట్టుకు నాయకత్వం వహించాడు.

కొత్త రక్తం..

కోహ్లీ కెప్టెన్సీలోఆర్సీబీ 2015లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఆ మరుసటి ఏడాదిలో రన్నరప్‌గా నిలిచింది. 2020, 2021లో ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. కోహ్లీ తరువాత డుప్లెసిస్ జట్టు కేప్టెన్సీ క్యాప్‌ను అందుకున్నాడు. ఈ సీజన్ నుంచి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టే క్రమంలో కొత్త రక్తం ఎక్కించింది రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్‌మెంట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+