IPL 2025: 18వ సీజన్.. 18 నంబర్ జెర్సీ.. ఈసాలా కప్ నమ్‌దే!
IPL 2025: నేడు(మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు మొదటి మ్యాచ్ లో తలపడనున్నాయి. ఆరంభ మ్యాచ్ లో గెలిచేందుకు రెండు జట్లు ఉత్సాహంతో ఉన్నాయి. అయితే గత 17 ఏళ్లగా ఐపీఎల్ టైటిల్ బెంగళూరు జట్టును అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. కనీసం ఈ సారైనా ఆర్సీబీ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సారి కూడా 'ఈసాలా కప్ నమ్‌దే' అంటూ సందడి చేస్తున్నారు. ఈ సారి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఐపీఎల్ 18వ సీజన్ అని తెలిసిన విషయమే. ఈ సీజన్ నంబర్ ను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ తో లింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ 18వ సీజన్ కాగా.. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం గమనార్హం. దీంతో ఈ సారి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలుస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
మూడు సార్లు ఫైనల్ లో..
2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2024 వరకు ఆర్సీబీ మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లిన ఆర్సీబీ.. గెలుపు ముంగిట బోల్తాపడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో సీఎస్కే, 2016లో సన్ రైజర్స్ జట్టుతో ఫైనల్ లో తలపడి ఓడిపోయారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన టాప్-5 జట్ల జాబితాలో ఆర్సీబీ ఉండడం విశేషం. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 142 మ్యాచ్ లు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. సీఎస్కే(138) రెండో స్థానంలో ఉంది. కోల్‌కతా(130) మూడోస్థానంలో, ఆర్సీబీ నాలుగో స్థానంలో, ఢిల్లీ ఐదో స్థానంలో ఉన్నాయి. ఆర్సీబీ 256 మ్యాచ్ ల్లో 128 ఓడిపోయి.. 121 మ్యాచ్ లలో విజయం సాధించగా.. 3 మ్యాచ్ లు టై అయ్యాయి. ఇది 18వ సీజన్ కాగా.. ఈ సీజన్ లో జట్టు కోహ్లీకి విజయాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటోంది.

ఫ్యాన్స్ ఆశలు నెరవేరేనా?
అయితే స్టార్ ఆటగాళ్లతో కళకళలాడే బెంగళూరు జట్టుకు భారీగా అభిమానులున్నారు. ఎలాంటి టీమ్ నైనా తేలికగా ఓడించగలదు. కానీ చాలా సీజన్లుగా లీగ్ దశలో అద్భుతంగా ఆడి.. కీలక ప్లేఆఫ్స్ లో చేతులెత్తేయడం అలవాటు అయిపోయింది. ఇలా ప్రతిసారీ "ఈసాలా కప్ నమ్‌దే" నినాదంతో ఐపీఎల్ టోర్నీని ప్రారంభిస్తున్న ఆర్సీబీ.. చివరికి నిరాశను మిగులుస్తోంది. ఈ సారి మాత్రం పరాజయాలు పునరావృతం కావాలని.. ఆర్సీబీ కప్ కొట్టాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ సారి ఆర్సీబీ జట్టు మంచి ఆటగాళ్లతో నిండి ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
ఆర్సీబీ జట్టు- ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, దేవ్ దత్ పడికల్, స్విస్తిక్ చికారా, జాకబ్ బేతవెల్, మనోజ్ భాండగే, మోహత్ రాథీ,రొమారియో షెపర్డ్, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, రసిక్ సలామ్, సూయాష్ శర్మ, నువాన్ తుషారా.
Jersey No. 18
— VeeraRaghava (@veeraraghavantr) March 21, 2025
Season No. 18
IPL debut on April 18
it’s all lining up! God, please make it happen this time! #RCB #ViratKohli #IPL2025 pic.twitter.com/4gvXh9Hr6I












Click it and Unblock the Notifications