Rishab Pant:పంత్ కోసం పట్టుబట్టిన కావ్యా పాప..లక్నో జేబుకు చిల్లు పెట్టించేసిందిగా..!!

రిషబ్ పంత్.. ప్రస్తుతం మాంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడు. ఇక ఐపీఎల్ వేలం సందర్భంగా రిషబ్‌ను దక్కించుకునేందుకు మూడు నాలుగు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. రిషబ్‌ను దక్కించుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.

రిషబ్ పంత్..2022 జనవరిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒకానొక సందర్భంలో క్రికెట్‌కు దూరమవుతాడా అన్న చర్చ జరిగింది. వీటన్నిటినీ అధిగమించి మళ్లీ బ్యాట్ పట్టాడు. రెండేళ్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఈ ఆటగాడు తిరిగి 2024 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. నాడు రిషబ్ పంత్‌ను రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే ఢిల్లీ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక మెగావేలం సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్‌ను వదులుకుంది.

IPL 2025 Rishab Pant sold to Lucknow super gaints for a hefty amount-deets here

ఇక రిషబ్ పంత్ ‌కోసం పోటీ ప్రారంభం అవగానే పలు ఫ్రాంఛైజీలు ఈ యంగ్‌స్టర్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ తీవ్రంగా సాగింది. ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. 2 కోట్లతో ప్రారంభమైన ధర రూ.20 కోట్ల ఫిగర్‌ను టచ్ చేసింది. ఒకానొక సందర్భంలో లక్నో సూపర్ జైంట్స్ పోటీ నుంచి తప్పుకుని రిషబ్‌ను కావ్యాకు అప్పగిస్తారేమో అనిపించింది. కానీ వాళ్లు కూడా తగ్గలేదు.

చివరిగా తమ దగ్గరున్నది రూ.45 కోట్లు మాత్రమే అని తెలుసుకున్న కావ్యా పాప పోటీ నుంచి తప్పుకుంది. ఇక పంత్‌ను లక్నోకు వెళుతున్నట్లు ఆక్షనీర్ ప్రకటించింది. అయితే ఇక్కడ ఢిల్లీ తన రైట్ టూ మ్యాచ్ కార్డు వినియోగించుకుంది. మళ్లీ ఆక్షన్‌లోకి దిగింది. చివరకు లక్నో రూ.27 కోట్లు అని రౌండ్ ఫిగర్ చెప్పగానే.. ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో లక్నో‌కు పంత్ చేరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+