ఏమి గుండె రా అది..!!
Virat Kohli: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.
ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ వచ్చాడు. ఈ టీమ్ మెంటార్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో అపాయింట్ అయ్యాడు.

తాజాగా ఇలాంటి మార్పే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనూ చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి కేప్టెన్సీ అవతారం ఎత్తాడు. తన సొంత టీమ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పగ్గాలను అందుకోనున్నాడు. ఆర్సీబీ కేప్టెన్‌గా కోహ్లీకి పట్టాభిషేకం చేయడం దాదాపుగా ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతంలో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కేప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ తరువాత సారధ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. కెప్టెన్సీ హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నాడు. ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తరువాత ఫాఫ్ డుప్లెసిస్ ఆ జట్టు సారధిగా నియమితుడయ్యాడు.
అయినప్పటికీ- ఎలాంటి అద్భుతాలూ చోటు చేసుకోలేదు రాయల్ ఛాలెంజర్స్‌లో. ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. కప్‌ను అందుకోవడంలో విఫలమౌతూనే వస్తోంది. 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లగలిగింది. నాలుగో స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లో లీగ్స్ దశకే పరిమితమైంది. ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అంతే నాలుగో స్థానమే.
దీనితో ఆర్సీబీ యాజమాన్యం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. జట్టులో అత్యంత సీనియర్, టీమిండియా బ్యాటింగ్ బ్యాక్ బోన్‌గా నిలకడగా రాణిస్తూ వస్తోన్న విరాట్ కోహ్లీకే మరోసారి కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించింది. ఒకరకంగా ఇది అతనికి కత్తి మీద సాములాంటిదే. ఈ సాలా కప్ నమ్దే అనే స్లోగన్‌ను నిజం చేయకపోతే ట్రోల్స్ బారిన పడటం ఖాయం.












Click it and Unblock the Notifications