ఆ ఐపీఎల్ టీమ్‌లో జహీర్ భాయ్ కీ రోల్..!!

Zaheer Khan: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నాయి.

కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ కమ్ డైరెక్టర్‌ను వెదుక్కునే పనిలో పడింది. మొన్నటివరకు ఈ హోదాలో పని చేసిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. కొందరు మాజీ ప్లేయర్ల పేర్లను పరిశీలిస్తోంది.

IPL 2025 Zaheer Khan has appointed as the mentor of LSG

నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్‌పైనా వేటు పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ సీజన్‌లో అతను ఘోరంగా విఫలం అయ్యాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటర్.. చేసింది 168 పరుగులే. వ్యక్తిగత అత్యధిక స్కోర్.. 26. బ్యాటింగ్ సగటు 18. 67గా రికార్డయింది.

ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ను వదులుకోవాలని భావిస్తోంది కేకేఆర్ ఫ్రాంఛైజీ. మెగా వేలం పాట సందర్భంగా రిటైన్ చేసుకోకవచ్చు. అతన్ని విడుదల చేయవచ్చు. అలాగే- సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ముగ్గురు ప్లేయర్లను రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఉమ్రాన్ మలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్‌కు ఉద్వాసన పలకొచ్చు.

ఢిల్లీ కేపిటల్స్‌కూ కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. ఈ సీజన్ వరకూ ఈ స్థానంలో పని చేసిన ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్ రికీ పాంటింగ్‌పై వేటు వేసింది ఢిల్లీ కేపిటల్స్ మేనేజ్‌మెంట్. అతన్ని తప్పించింది. కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది కూడా. కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

ఈ పరిస్థితుల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓ ముందడుగు వేసింది. కొత్త మెంటార్‌ను అపాయింట్ చేసింది. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. ఆయన పేరుతో ముద్రించిన జెర్సీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆవిష్కరించారు.

2008 నుంచి 2017 వరకు ఐపీఎల్‌లో వివిధ జట్లల్లో ప్లేయర్‌గా మెరుపులు మెరిపించాడు జహీర్ ఖాన్. మొత్తం 100 మ్యాచ్‌లను ఆడాడు. 102 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4/17. 7.59 ఎకానమీని నమోదు చేశాడు. 2018 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాఫ్‌గా, డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+