IPL 2026: కొంపముంచిన గిల్.. ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ

IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ 2026 ఫైనల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది (2025) తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ.. ఇప్పుడు 'బ్యాక్ టు బ్యాక్' ట్రోఫీలను ముద్దాడింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ (2019, 2020), చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011)ల సరసన ఆర్‌సీబీ చేరింది. ఈ చారిత్రాత్మక విజయంలో రికార్డు ఇన్నింగ్స్ ఆడిన 'చేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ.. అద్భుతంగా బౌలింగ్ చేసిన రసిఖ్ సలామ్ దార్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

గుజరాత్ కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆర్సీబీ పేసర్లు చుక్కలు చూపించారు. రసిఖ్ సలామ్ నేతృత్వంలో బెంగళూరు బౌలింగ్ విభాగానికి తోడు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెలరేగడంతో గుజరాత్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్) ఒక్కడే అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10), సాయి సుదర్శన్ (12), జోస్ బట్లర్ (19) ఘోరంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమై ఓటమికి తల వంచింది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లతో టాప్ పెర్ఫార్మర్ గా నిలవగా.. భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు, కృనాల్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది.

IPL 2026 Final RCB Crowned Champions Again As Virat Kohli Fast 50 Destroys Gujarat Titans

అనంతరం 156 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (1), రజత్ పాటిదార్ (15), కృనాల్ పాండ్యా (0)లను రషీద్ ఖాన్, కగిసో రబాడలు వరుస ఓవర్లలో ఔట్ చేయడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. ఒక దశలో ఆర్సీబీ 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే మరో ఎండ్ నుంచి విరాట్ కోహ్లీ పట్టుదలతో క్రీజులో నిలబడి జట్టును ఆదుకున్నాడు. లీగ్ అంతటా అద్భుతంగా రాణించిన రబాడకు ఈ సీజన్‌లో ఇది 29వ వికెట్ కావడం గమనార్హం.

విరాట్ విధ్వంసం

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ఇదే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కాగా.. ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో సంయుక్తంగా మూడో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది. చివరలో టిమ్ డేవిడ్ (24) అవుట్ అయినప్పటికీ, జితేష్ శర్మతో కలిసి కోహ్లీ ఆర్‌సీబీని విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచిన కింగ్ కోహ్లీ బెంగళూరు అభిమానుల దశాబ్దాల నిరీక్షణను వరుసగా రెండో ఏడాది కూడా నిజం చేస్తూ కప్‌ను అందించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లతో రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+