ఐపీఎల్ చరిత్రలో క్యాచ్‌ల రారాజులు వీరే.. టాప్-15 ఫీల్డర్ల జాబితా ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008 నుంచి క్రికెట్ ప్రతిభకు వేదికగా మారింది. బ్యాటర్లు, బౌలర్లు మెరుపులు మెరిపిస్తుంటారు. కానీ మ్యాచ్ గమనాన్ని మార్చే ఫీల్డర్ల చురుకుదనం, వేగానికీ తక్కువేమీ కాదు.కొందరు అద్భుతమైన బౌండరీ వద్ద ఫీల్డింగ్‌తో, ఇంకొందరు మ్యాచ్‌ను మలుపు తిప్పే క్యాచ్‌లతో ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్-15 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఫీల్డింగ్‌ను చాలామంది తక్కువ అంచనా వేస్తారు. కానీ ఐపీఎల్‌లో అది అత్యంత కీలకం. చాలా మంది ఆటగాళ్లు ఏళ్ల తరబడి అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలు నెలకొల్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ విరాట్ కోహ్లీ 252 మ్యాచ్‌ల్లో 114 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అతని వేగవంతమైన రిఫ్లెక్స్‌లు, మైదానంలో నిలకడ అతడిని ప్రత్యేకంగా నిలబెడతాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజం సురేష్ రైనా పటిష్టమైన చేతులతో 109 క్యాచ్‌లు పట్టి రెండో స్థానంలో నిలిచాడు. రైనా 2021లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ipls-catch-kings-top-15-fielders-with-the-most-catches-in-ipl-history

ముంబై ఇండియన్స్ (ఎంఐ) విధ్వంసకర ఆటగాడు కీరోన్ పొలార్డ్ బౌండరీ లైన్ దగ్గర మ్యాచ్ విన్నర్‌గా నిలిచేవాడు. 189 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా సరిగ్గా అంతే క్యాచ్‌లు పట్టాడు. ఈ ఆల్‌రౌండర్ మెరుపు వేగంతో మ్యాచ్‌లను తనవైపు తిప్పుకోగలడు. ఇక రోహిత్ శర్మ నాయకుడిగానే కాకుండా, నమ్మదగిన స్లిప్ ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. 257 మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు ఖాతాలో వేసుకున్నాడు.

శిఖర్ ధావన్ బ్యాటింగ్‌తోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. అతడు 99 క్యాచ్‌లు అందుకున్నాడు. ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో అత్యంత చురుకైన ఫీల్డర్లలో ఒకడు. ప్రతి ఇన్నింగ్స్‌కు 0.692 సగటుతో 90 క్యాచ్‌లు పట్టాడు. దూకుడు బ్యాటర్లుగా పేరున్న డేవిడ్ వార్నర్, మనీష్ పాండే ఫీల్డింగ్‌లోనూ తమ సత్తా చాటుతున్నారు. వార్నర్ 86 క్యాచ్‌లు, పాండే 83 క్యాచ్‌లు అందుకున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. 145 మ్యాచ్‌ల్లో 81 క్యాచ్‌లు అందుకున్నాడు. తన అథ్లెటిసిజంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ ఆటగాళ్లు ఐపీఎల్ ఫీల్డింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు. భారీ షాట్లు కొట్టినంత మాత్రాన సరిపోదు, క్యాచ్‌లు పట్టడం కూడా మ్యాచ్‌లో కీలక మలుపు తిప్పుతుందని నిరూపించారు. 2025 సీజన్ దగ్గరపడుతుండటంతో, ఈ రికార్డులను బ్రేక్ చేసేందుకు కొత్త ఆటగాళ్లు వస్తారేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+