రాజకీయాల్లోకి ధోనీ.. అక్కడి నుంచే పోటీ..?
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ.. ఇలా పాత్ర ఏదైనా జట్టుకు ఎప్పుడూ వెన్నముకలా నిలబడి.. ఎప్పటికప్పుడు జట్టుకు తనవంతు కృషి చేస్తూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నారు ధోనీ. క్లిష్ట సమయంలో మ్యాచ్ ను గెలిపించాలన్నా, ఎంపైర్ నిర్ణయంపై అనుమానం ఉన్నా, క్రీజులో కుదురుగా ఆడుతున్న బ్యాటర్లను పెవిలియన్ కు పంపాలన్నా.. ఇలా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జట్టులో కెప్టెన్ ఉన్నా ధోనీ సలహానే తీసుకుంటుంది టీమ్. ధోనీ అంటే అంత నమ్మకం జట్టుకు.
ఇక ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మూడు కప్పుల్ని సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం గమనార్హం. అయితే తాజాగా ధోనీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు గుప్పుమన్నాయి. మహీ రాజకీయాల్లోకి రానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ధోనీ మంచి పొలిటీషియన్..
తాజాగా ధోనీ పొలిటికల్ ఎంట్రీపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన శుక్లా.. "ధోనీ మంచి రాజకీయ నాయకుడు కాగలిగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ధోనీకి పొలిటీషియన్ గా రాణించేంత సామర్థ్యం ఉంది. కానీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయం.ధోనీ బంగాల్ రాజకీయాల్లోకి వెళ్తాడని సౌరభ్, నేను భావించాం. అతనికి మంచి ప్రజాదరణ ఉంది" అని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.
ఫోన్ వాడడు..
ఇక ధోనీ ఏదైన పనిలో పడితే ఫోన్ కూడా చూడడని.. అతనికి సోషల్ మీడియా అంటే ఆసక్తి ఉండదన్నారు శుక్లా. మేము ఎప్పుడైనా ఆయన్ను సంప్రదించాల్సి వచ్చిన సమయంలో తమకు చాలా కష్టంగా ఉండేదని చెప్పారు.












Click it and Unblock the Notifications