లవర్ తో పెళ్లి చేస్తాం అనే సరికి ఇంతలా రెచ్చిపోయి ఆడతావేంట్రా
ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది ఎదురుచూస్తూ వస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడే. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆర్క్ రైవల్స్ భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. శ్రీలంక దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీనికోసం రెండు జట్లూ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. పాకిస్తాన్ జట్టు పరిస్థితెలా ఉన్నప్పటికీ.. టీమిండియా మాత్రం ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది.
కాగా- వరల్డ్ కప్ జోష్ మధ్య టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పెళ్లికి సంబంధించిన తాజా సమాచారం వెల్లడైంది. బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన ఇషాన్ తాత అనురాగ్ పాండే.. తన మనవడి వెడ్డింగ్ ను నిర్ధారించారు. మోడల్ అదితి హుండియాతో అతని సంబంధం గురించి కీలక వివరాలను పంచుకున్నారు. ఇషాన్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల ఎదురుచూపులు ముగిసినట్టే కనిపిస్తున్నాయి.

కుటుంబం పాత సంప్రదాయాలను విడిచిపెట్టి పిల్లల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అనురాగ్ పాండే స్పష్టం చేశారు. ఇషాన్ వివాహ నిర్ణయం పూర్తిగా అతనిదేనని కుండబద్దలు కొట్టారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇషాన్ స్వయంగా తనతో మాట్లాడాడని తాతయ్య తెలిపారు. సమాజం అభిప్రాయాల కంటే ఇషాన్ సంతోషమే తమ కుటుంబానికి ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. తన మనవడు ఎవరినైతే ఇష్టపడతాడో, కుటుంబం వారిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇషాన్ కిషన్ ప్రియురాలు అదితి హుండియా రాజస్థాన్ కు చెందిన మోడల్. జైపూర్‌లో నివాసం ఉంటోన్నారు. మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచారు. అదితి తన ఇంటర్వ్యూను చాలా మెచ్చుకుందని ఇషాన్ చెప్పాడని అనురాగ్ పాండే తెలిపారు. ఇప్పుడు పెళ్లికి అడ్డు చెప్పడం ఏ మాత్రం సరికాదని, పెద్ద మనవడు (ఇషాన్ కిషన్ అన్న) కూడా తాను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడని, ఇషాన్ విషయంలోనూ అదే సంప్రదాయాన్ని పాటిస్తామని అన్నారు.
పెళ్లి ఎప్పుడనేది తెలియట్లేదు గానీ.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. దాదాపుగా రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది. దీని తర్వాతే ఇషాన్ కిషన్- ఆదితి హుండియా పెళ్లి పీటలు ఎక్కుతారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications