టీం ఇండియాను వణికించిన 22ఏళ్ల కుర్రాడు- ఎవరీ జాకబ్ బెథెల్, IPL టీం..రేటు..!!
జాకబ్ బెథెల్. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం అభినందిస్తున్న పేరు. భారత్ తో జరిగిన సెమీ ఫైనల్ లో చివరి వరకు సూర్య టీంను బెంబేలెత్తించాడు. 22 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ను భారత్ ఫ్యాన్స్ తో సహా క్రికెట ను ఇష్టపడే ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్ ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు అంతగా ప్రచారంలో లోని జాకబ్ బెథెల్ ఐపీఎల్ లోనూ తన ఆటతో ఆకట్టుకున్నాడు. అయితే, ఏ టీం నుంచో తెలుసా.. ఎంతకు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది అనేది ఆసక్తి కరమే. ఇప్పుడు సోషల్ మీడియాలో బెథెల్ గురించి పెద్ద ఎత్తున సెర్చింగ్ జరుగుతోంది.
జాకబ్ బెథెల్ టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ ను గెలుపు చివరి వరకు తీసుకెళ్లిన యువ కెరటం. 22 ఏళ్ల ఈ యవ సంచలనం ఆట తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ఉన్నా భయపడలేదు. దూకుడు ఆడాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ ను గెలిపించినంత పని చేశాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ తో ఒక్కసారిగా జాకబ్ బెథెల్ హీరో అయిపోయాడు.

జాకబ్ గ్రాహం బెథెల్ ఇంగ్లండ్ క్రికెటర్. సెప్టెంబర్ 2024లో సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దేశీయ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 2003 అక్టోబర్ 23న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో పుట్టి పెరిగిన బెథెల్.. వార్విక్‌షైర్‌లోని ప్రతిష్టాత్మక రగ్బీ స్కూల్‌లో స్కాలర్‌షిప్ పొందాడు. 13 సంవత్సరాల వయసులో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అతని తాత ఆర్థర్ బెథెల్ బార్బడోస్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

ఆర్టీసీ నుంచి ఐపీల్ లోనూ సత్తా చాటుతూ
2024లో న్యూజిలాండ్ పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేయడానికి ముందు.. బెథెల్ ఇంగ్లండ్ తరపున 20 టీ20 మ్యాచ్‌లు, 18 వన్డే మ్యాచ్‌లు, 4 టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో సగటున 38.7 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 96. ఆగస్టులో ఓవల్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో అతడు 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం 6, 5 పరుగులు మాత్రమే చేశాడు. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన మ్యాచ్‌లో బెథెల్ తన ఆటతో ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టు సభ్యులు జై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్, టాడ్ మర్ఫీలను ఎదుర్కొని ఇంగ్లండ్ లయన్స్ తరపున 71 పరుగులు చేశాడు. బెథెల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్దోడాక్స్ బౌలర్ కూడా. టెస్ట్ బెస్ట్ ఫిగర్స్ 3-72. ఇక, ఐపీఎల్ మెగావేలం 2026కి ముందు ఆర్‌సీబీ జాకబ్ బెథెల్‌ను 2.60 కోట్లకు నిలుపుకుంది. వాంఖడేలో జాకెబ్ విధ్వంసం చూశాక.. ఆర్‌సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్‌లో అతడు ఇంకెన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడో చూడాలి.
ENDING THE BEST YOUNGSTER DEBATE TODAY pic.twitter.com/Qgf9Unt2rU
— kay (@mandhanamp4) March 5, 2026
At Any Cost Don't Release Him
— 𝑺𝒉𝒊𝒗𝒂 𝑻𝒂𝒓𝒂𝒌 18🐉 (@SK_Kohli_18) March 5, 2026
In Future @RCBTweets
He Is Our future Star Boy #INDvENGpic.twitter.com/at5JsA1XwD
There Is No Shame In Losing If You Lose Like Him 🔥 pic.twitter.com/JPv0fOUzYg
— KOHLISM (@166of110) March 6, 2026
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications