ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి..
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో స్వర్ణం కైవసం చేసుకుంది. కాగా ఈసారి 100 మీటర్ల హర్డిల్స్ రేసును 12.96 సెకన్లలో ముగించి రికార్డు సృష్టించింది. 2023లోనూ జ్యోతి స్వర్ణం సాధించడంతో 100 మీ హర్డిల్స్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పసిడి పతకాలు సాధించిన అయిదో క్రీడాకారిణి ఆమె స్థానం సాధించింది.
ఈ విజయంతో జ్యోతి తెలుగు క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 1998లో ఓల్గా షిషిజినా (కజకిస్తాన్), 2011లో సున్ యావీ (చైనా)లు నెలకొల్పిన 13.04 సెకన్ల రికార్డును జ్యోతి అధిగమించింది.

జ్యోతి కుటుంబ నేపథ్యం..
విశాఖపట్నం జిల్లా ఒక సాధారణ కుటుంబంలో జ్యోతి జన్మించారు. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా, తల్లి హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా పెద్ద స్థాయిలో కాకపోయినా, జ్యోతి తల్లితండ్రుల కష్టంతో ముందుకు సాగింది. చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి కలిగి, పాఠశాలలో శారీరక విద్య ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హెర్డిల్స్‌లో శిక్షణ పొందడం ప్రారంభించింది. 2023లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆ రీసెంట్ గా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో కేవలం 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
ఈ విజయం తాను సాధించిన కష్టం, తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే సాధ్యమైందని జ్యోతి చెబుతున్నారు. తన తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తూ నెలకు సుమారు రూ.18వేలు పొందుతూ.. కుటుంబాన్ని పోషించారాని ఎమోషనల్ అయ్యారు.
ప్రముఖుల ప్రశంసలు..
జ్యోతి విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమెను తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప క్రీడాకారిణిగా అభివర్ణించారు. అంతే కాకుండా భవిష్యత్తులో జరగబోయే పారిస్ ఒలింపిక్స్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వంటి పోటీలలో కూడా మరోసారి సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు సైతం ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications