కావ్య పాప ఇచ్చే కిక్కే వేరబ్బా
కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్య మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.
కావ్య మారన్ ఇచ్చే భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌లోనూ కావ్య మారన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

ఉప్పల్ వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌కు సపోర్టుగా కావ్య మారన్ సందడి చేసింది. తన టీం బ్యాటర్లు ఫోర్లు , సిక్సులు కొట్టినప్పుడు నవ్వుతూ కనిపించింది. కెమెరా మ్యాన్ కూడా పదే పదే కావ్య మారన్‌నే చూపించడం జరిగింది. దీంతో నెటిజన్లు కావ్య మారన్‌పై కామెంట్ల రూపంలో తమ ప్రేమను చూపిస్తున్నారు.ఒకరేమో నేను కావ్య మారన్ కోసమే మ్యాచ్ చూస్తున్నా అని కామెంట్ చేయగా, మరొకరు కావ్య పాప ఇచ్చే కిక్కే వేరంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం కావ్య మారన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications