పెళ్లిపీటలు ఎక్కనున్న ఐపీఎల్ స్టార్ ఆల్‌రౌండర్: లైఫ్ స్టైల్ ఎంప్లాయ్‌తో నిశ్చితార్థం
బెంగళూరు: క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మర్కండైజ్ ప్లానర్ శృతి రఘునాథన్‌ను పెళ్లాడనున్నాడు. శృతి రఘునాథన్‌తో తాజాగా నిశ్చితార్థం పూర్తయింది. పెద్దలు కుదర్చిన సంబంధానికి అతను ఓకే చెప్పాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. 2021లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌కు సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచీ జట్టులో ఆల్ రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తోన్నాడు.

ఇప్పటివరకు 36 మ్యాచ్‌లను ఆడిన వెంకటేష్.. 956 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 104. బ్యాటింగ్ యావరేజ్ 28.12. 130. 25 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఇదివరకు జాతీయ జట్టుకూ ఎంపికయ్యాడు.
జాతీయ జట్టుకూ ఎంపికయ్యాడు వెంకటేష్. తొమ్మిది టీ20 ఇంటర్నేషనల్స్, రెండు వన్డేలు ఆడాడు. బెంగళూరుకు చెందిన శృతి రఘునాథన్‌తో నిశ్చితార్థం కుదిరినట్లు వెంకటేష్ అయ్యర్ తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అందులో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశాడు.
శృతి రఘునాథన్ స్వస్థలంలో తమిళనాడులోని కోయంబత్తూర్. పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బీకామ్ చదివారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మర్కండైజ్ ప్లానర్‌గా పని చేస్తోన్నారు. వచ్చే సంవత్సరం ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications