Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గిల్లితే గిల్లించుకోవాలి..

Shubman Gill: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. తిరుగులేని విజయాలను అందుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో రెండింట్లో మాత్రమే ఓడిందీ జట్టు. ఆరు విజయాలతో 12 పాయింట్లను దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది.

సోమవారం రాత్రి కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీమ్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 39 పరుగుల తేడాతో మట్టికరిపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒకరకంగా మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది గుజరాత్.

KKR vs GT Gujarat Titans on top of table under impressive Gill s captaincy in IPL 2025

తొలి వికెట్ భాగస్వామ్యానికి 114 పరుగులను జోడించిందంటే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తోన్నారు. సాయి.. మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 36 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.

ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో 417 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్. అతని బ్యాటింగ్ యావరేజ్.. 52.12. 152 స్ట్రేక్ రేట్‌ను నమోదు చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్ ఆడటం- గుజరాత్ టైటాన్స్‌ భారీ స్కోర్‌ను నిర్దేశించగలిగింది ప్రత్యర్థికి. 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించాడు బట్లర్. బౌలర్లను తుత్తునీయలు చేశాడు.

శుభ్‌మన్ గిల్‌ కేప్టెన్సీకి అద్దం పట్టిందీ మ్యాచ్. బ్యాటర్‌ కమ్ కేప్టెన్‌గా డ్యుయెల్ రోల్‌ను సమర్థవంతంగా నిర్వర్తిస్తోన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి.

జట్టు కేప్టెన్‌గా గిల్‌కు ఇది రెండో సీజన్ మాత్రమే. గత ఏడాదే అతను కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. అప్పటి వరకు జట్టుకు కేప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు తరలి వెళ్లడంతో ఫ్రాంఛైజీ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. తొలి సీజన్‌లో విఫలం అయ్యాడు గిల్.

KKR vs GT Gujarat Titans on top of table under impressive Gill s captaincy in IPL 2025

గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ లీగ్స్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లల్లో గెలిచింది అయిదే. ఏడింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్యాటర్‌గా కూడా గిల్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయాడు. కేప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు అప్పట్లో.

ఏడాది తిరిగేసరికి జట్టును టేబుల్ టాపర్‌గా నిలపగలిగాడు. వరుస విజయాలను అందించగలుగుతున్నాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లల్లోనే ఓడింది గుజరాత్. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆ తరువాత లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసిందంతే. మిగిలిన అన్నింట్లోనూ తడాఖా చూపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+