IPL 2025: ఏం తాగి కొట్టారో.. ఇప్పట్లో అందుకోవడం కష్టమే..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ హవా నడుస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 18 జరుగుతోంది. అయితే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్లలో అనేక జట్లు, అనేకమంది ప్లేయర్లు ఎన్నో రికార్డులు, మరపురాని ఘనతలు, చెరగని ముద్రను వేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Kohli Dhawan Rohit Sharma Warner and Raina Lead the IPL Run-Scorers List

ఐపీఎల్ అన్ని సీజన్లు కలిపి అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 8,004 రన్స్ చేశాడు. కోహ్లీ దరిదాపులో కూడా ప్రస్తుతం ఎవరూ లేరు. ఇక రెండో ప్లేస్ లో శిఖర్ ధావన్ (డీసీ, డీసీహెచ్, ఎంఐ, పీబీకేఎస్, ఎస్ఆర్‌హెచ్) కొనసాగుతున్నాడు. ఆయన మొత్తం ఐపీఎల్ సీజన్లు కలిపి 6,769 పరుగులు రాబట్టాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ (డీసీహెచ్, ఎంఐ) ఉన్నాడు. హిట్ మ్యాన్ అన్ని ఐపీఎల్ ఫార్మట్లు కలిపి 6,628 రన్స్ చేశాడు.

ఇక నాలుగో స్థానంలో డేవిడ్ వార్నర్ (డీసీ, ఎస్ఆర్‌హెచ్) కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు వార్నర్ ఐపీఎల్లో 6,565 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో సురేశ్ రైనా (సీఎస్కే, జీఎల్) కొనసాగుతున్నాడు. రైనా 5528 రన్స్ రాబట్టాడు. ఇక లేటెస్ట్ ఐపీఎల్-18 వ సీజన్ మార్చి 22న ప్రారంభం అయింది. మరి ఈ ఐపీఎల్ సీజన్ లో ఎలాంటి అరుదైన రికార్డులు నమోదవుతాయో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+