ఈ ఓవరాక్షన్‌కు ఎంత పనైంది?
PBKS vs LSG: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడు కంటిన్యూ అవుతోంది. వరుసగా రెండో విజయాన్ని అందుకుందా జట్టు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. మంగళవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన లోకల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ టాప్ స్కోరర్. 44 పరుగులతో అదరగొట్టాడు. మిడిలార్డర్ బ్యాటర్ ఆయుష్ బదోనీ 30 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 41, చివర్లో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఈ స్కోర్‌ను ఊదిపడేసింది. ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయినప్పటికీ- పెద్దగా ఒత్తిడికి గురి కాలేదా జట్టు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్- 69, కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్- 52 (నాటౌట్), నేహల్ వాధ్వా- 43 (నాటౌట్) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
16.2 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులతో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపడింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ పొజీషన్‌లో కొనసాగుతోంది.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్‌లో రెండు వికెట్లను కూడా దిగ్వేష్ రాఠీ ఖాతాలో పడ్డాయి. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లను పెవిలియన్ దారి పట్టించాడీ లెగ్ బ్రేక్ బౌలర్. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులే ఇచ్చి రెండు వికెట్లను అందుకున్నాడు.
ఆ ఆనందం అతనికి నిలవకుండా పోయింది. భారీ జరిమానాను ఎదుర్కొన్నాడు దిగ్వేష్. ప్రియాన్ష్ ఆర్య అవుట్ అయినప్పుడు అతని వద్దకు వెళ్లి.. చేతిపై ఏదో రాస్తున్నట్లు ప్రవర్తించాడు. గతంలో ఓ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇదే తరహాలో లక్నో సూపర్ జెయింట్స్‌ను వెక్కించింది.
ఇప్పుడు దానికి ప్రతీకారంగా అన్నట్లు వ్యవహరించాడు. ఇది ఫైన్‌కు దారి తీసింది. అతనికి చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. అలాగే- ఓ డీమెరిట్ పాయింట్‌ను ఎదుర్కొనాల్సొచ్చిందతనికి.
-
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..












Click it and Unblock the Notifications