స్ట్రాటజీ మార్చిన పాకిస్తాన్: లైట్ గా తీసుకుంటే కొంప కొల్లేరే

ఆసియా కప్ 2025లో భాగంగా దాయాది దేశాలు భారత్-పాకిస్తాన్ మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్లు తలపడబోతోన్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలు ఉన్న మ్యాచ్ ఇది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి.. ఈ రెండు జట్లు. ఈ నెల 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభారంభం చేసింది టీమిండియా. అదే ఊపును పాకిస్తాన్ పైనా ప్రదర్శించడానికి ఉవ్విళ్లూరుతోంది.

అటు పాకిస్తాన్ కూడా ఆసియా కప్ లో బోణీ కొట్టింది. ఒమన్ పై దుమ్ము రేపింది. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం చెలరేగింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఒమన్ ను జస్ట్.. 67 పరుగులకే కుప్పకూల్చింది. బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించుకుంది పాకిస్తాన్. ఆరుమంది బౌలింగ్ చేస్తే.. వాళ్లందరికీ వికెట్లు దక్కాయి. ఒక్కరు కూడా ఖాళీ చేతులతో మ్యాచ్ ను ముగించలేదు. సయీం అయూబ్, సూఫియాన్ ముకీమ్, ఫహీమ్ అష్రాఫ్ రెండేసి చొప్పున, షహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Manjrekar s Take India s Batting Lineup Faces Tough Test Against Pakistan s Spinners

టీమిండియాను ఎదుర్కొనడానికి ముందు జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ నెగ్గడం పట్ల మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. భారత్ పై స్పిన్-హెవీ వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. స్పిన్ బౌలింగ్ స్ట్రాటజీ భారత్‌కు పెద్ద సవాల్‌గా మారుతుందని అంచనావేశాడు. యూఏఈ పిచ్ లు కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉండటం పట్ల భారత్.. పాకిస్తాన్ ను తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొన్నాడు.

ఈ అసాధారణ బౌలింగ్ విధానం భారత జట్టుకు సరికొత్త సవాలును విసిరే అవకాశం ఉందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ కాంబినేషన్ తనకు నచ్చిందని, ఒమన్ పై పాకిస్తాన్ స్పిన్ అటాక్ భారత బ్యాటర్లను తమ వ్యూహాలను పునరాలోచించుకునేలా చేయవచ్చని అన్నాడు. భారత బ్యాటర్లు గతంలో పాకిస్థాన్‌తో ఆడినప్పటికీ.. నిర్దుష్టమైన పేస్ అటాక్‌ను ఎదుర్కొన్నారని, ఇప్పుడు పాక్ వ్యూహం మార్చిందని, వారి బౌలింగ్ లో దాదాపు పేస్ లేదని అన్నాడు.

టీ20 ఫార్మట్ లో మొదటి ఆరు నుంచి ఎనిమిది ఓవర్లల్లో స్పిన్ బౌలర్లను బరిలోకి దించుతారని ఎవరూ ఊహించబోరని మంజ్రేకర్ అన్నాడు. రెండు ఓవర్లు మాత్రమే పేస్ బౌలింగ్, మిగిలినవన్నీ స్పిన్ బంతులేనని గుర్తు చేశాడు. పాకిస్థాన్ స్పిన్ బౌలింగ్ ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో అందరితో పాటు తాను కూడా ఎదురు చూస్తోన్నానని వ్యాఖ్యానించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+